మంత్రి లోకేష్‌ రాజకీయ అజ్ఞాని

8 Oct, 2018 13:34 IST|Sakshi
వైఎస్సార్‌సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి

వైఎస్సార్‌సీపీ ఘన విజయం ఖాయం

నవరత్నాలు ప్రజలను ఆకట్టుకున్నాయి

ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి  

నెల్లూరు, ఆత్మకూరు: రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ రాజకీయ అజ్ఞాని అని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. ఆత్మకూరులో ఆదివారం ఆయన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇటీవల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌ సభ్యులు రాష్ట్రానికి ప్రత్యేక çహోదా ప్రకటించకపోవడంతో తమ పదవులకు రాజీనామా చేశారని తెలిపారు. దీంతో ఖాళీ అయిన ఎంపీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం లేదని, ఈ విషయంపై అవగాహన లేని నారా లోకేష్‌ బీజేపీ, వైఎస్సార్‌సీపీ కుమ్మక్కయ్యాయని ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబ«ంధనల మేరకు ఏడాదిలోపు ఎన్నికలున్న రాష్ట్రాల్లో ఉపఎన్నికలు నిర్వహించరనే విషయం రాష్ట్ర మంత్రి అయిన లోకేష్‌కు తెలియకపోవడం సిగ్గు చేటన్నారు. అవగాహన లేమితో కేంద్ర ప్రభుత్వంతో వైఎస్సార్‌సీపీ లాలూచీ అయిందని ఆయన ఆరోపించడాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు.

అందరికీ మేలు జరుగుతుంది
ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్సార్‌ కాంగ్రెప్‌ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని ఎమ్మెల్యే గౌతమ్‌రెడ్డి అన్నారు. ఆత్మకూరులోని 21వ వార్డు పరిధిలో కొత్తపల్లి రామయ్య నేతృత్వంలో సుమారు 50 మందికి పైగా ఎమ్మెల్యే సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్నివర్గాల ప్రజలకు మేలు కలిగేలా జగన్‌ ప్రకటించిన నవరత్నాలు ప్రజలు, టీడీపీ కార్యకర్తలను సైతం ఆకట్టుకుంటున్నట్లు చెప్పారు. దీంతో వైఎస్సార్‌సీపీలో చేరేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందన్నారు. 2014 ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రజలు సంపూర్ణ మద్దతు తెలపడంతో తాను ఘన విజయం సాధించానని, అదే స్ఫూర్తి ప్రజల్లో ఇప్పటికి ఉందన్నారు. నవరత్నాల అమలు కోసం ప్రజలు జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేసేందుకు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారని తెలిపారు. టీడీపీ కౌన్సిలర్లు, వైఎస్సార్‌సీపీలో గెలిచి పార్టీ కౌన్సిలర్లు ప్రజల బాగోగులు మరచిపోయి సొంత పనులు చేసుకుంటున్నారన్నారు. జగన్‌ సీఎం అయితే ప్రజలందరికీ మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా కార్యదర్శి సూరా భాస్కర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు అల్లారెడ్డి ఆనందరెడ్డి, జిల్లా ఎస్సీ సెల్‌ అధ్యక్షులు కొండా వెంకటేశ్వర్లు, ప్రచార కార్యదర్శి ఉల్సా పెంచలయ్య, రైతు విభాగం అధ్యక్షుడు కొప్పోలు చిన్నపరెడ్డి, నాయకులు ఆండ్రా సుబ్బారెడ్డి, నోటి వినయ్‌కుమార్‌రెడ్డి, గుండాల మధుసూదన్‌రెడ్డి, కేతా వేణుగోపాల్‌రెడ్డి, ఇందూరు సురేంద్రరెడ్డి, ఖాదర్‌బాషా, కలాం, షేక్‌ పర్వీన్, కేతా రవి, కామాక్షయ్యనాయుడు, సర్దార్, ముజీబ్, సయ్యద్‌ జమీర్‌బాషా, ఇరగన వెంకటేశ్వర్లు, తుమ్మల కొండారెడ్డి, కొప్పోలు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు