‘పారిశ్రామికాభివృద్ధి సాధించటమే లక్ష్యం’

12 Feb, 2020 10:56 IST|Sakshi

సాక్షి, విజయవాడ: నిరుద్యోగ యువతను పరిశ్రమలతో అనుసంధానించే కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. కేంద్రప్రభుత్వ తరహాలో అప్రెంటీస్ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు.. విజయవాడలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌ను ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి సాధించటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఉండకూడదన్నదే ముఖ్యమంత్రి  వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయమని మంత్రి గౌతమ్‌రెడ్డి  గుర్తు చేశారు. పరిశ్రమల స్థాపనకు ఎవరు ముందుకొచ్చినా పూర్తి సహకారం అందిస్తామని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెంచేందుకు నిరంతరం కృషి చేస్తామని గౌతమ్‌ రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు