దేశంలోనే ఏపీ రెండో స్థానంలో ఉంది: సుచరిత

26 Feb, 2020 13:07 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌కు తీర ప్రాంతం ఒక వరమని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. దీనివల్ల ఆర్థిక ప్రగతి, అభివృద్ధికి చాలా ఉపయోగంగా ఉంటుందన్నారు. బుధవారం ఆంధ్రప్రదేశ్‌ విపత్తు నిర్వహణ కార్యాలయంలో ‘ఎర్టీ వార్నింగ్‌ డిస్మినేషన్‌ సిస్టం’ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలకు వివిధ నూతన వ్యవస్థలను ఏర్పాటు చేస్తోందన్నారు. ముందస్తు హెచ్చరికల జారీ వ్యవస్థను ప్రారంభించటం సంతోషంగా ఉందన్నారు.  అలాగే ప్రకృతి విపత్తు కూడా ఉంటుంది కాబట్టి, ముందస్తు హెచ్చరికల జారీ వ్యవస్థను తీసుకు వచ్చామని హోంమంత్రి తెలిపారు. (దృష్టి మళ్లించడానికే ఆ దిక్కుమాలిన రాతలు..!)

ఏదైనా విపత్తు సంభవించే ప్రమాదం ఉన్నప్పుడు ముందస్తుగా అప్రమత్తం చేస్తే ప్రజల ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లకుండా చూడవచ్చన్నారు. విపత్తు ముందుగా తెలుసుకునే రాష్ట్రంగా ఏపీ...దేశంలోనే రెండో స్థానంలో ఉందన్నారు. తుఫానులు, వరదలు, భూకంపం, ఉప్పెనలు, సునామీలు, భారీ అగ్నిప్రమాదాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు, నష్టాల తీవ్రతను తగ్గించేందుకు ఈ ముందస్తు హెచ్చరికలు చాలా ఉపయోగపడతాయని హొంమంత్రి సుచరిత పేర్కొన్నారు. (రణ్‌బీర్‌ను మరోసారి ప్రశంసించిన బిగ్‌బీ)

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు