'ఆ విషయం వైఎస్‌ జగన్‌ ముందే చెప్పారు'

22 May, 2020 13:19 IST|Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి : కరోనా కట్టడి అయ్యేవరకు కరోనాతో కలిసి జీవించాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చెబితే కొందరు అవహేళన చేశారు.. కానీ నేడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అదే చెబుతుందంటూ రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. ఎమ్మెల్యే అబ్బాయ చౌదరితో కలిసి సుచరిత శుక్రవారం దెందులూరు జాతీయ రహదారిపై వలస కులీలకు ఉచితంగా భోజన ప్యాకెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కరోనా కట్టడి నేపధ్యంలో లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లు, మంత్రులు ప్రజలకు అండగా నిలిచారన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో వలస కులీలను అన్ని విధాలా ఆదుకునేందుకు ఇప్పటికే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి వారిని తరలించామని తెలిపారు. (కందిపప్పు.. ఇక్కడ నచ్చకుంటే అమరావతికి వెళ్లు!)

కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటునే రైతులను అన్ని విధాల ఆదుకునేందుకు చర్యలు చేపట్టారన్నారు. దేశంలోనే కరోనా వైద్య పరీక్షలు అత్యధికంగా ఆంద్రప్రదేశ్‌లో‌ జరిగాయన్నారు. కరోనా నివారణపై  వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి రెండు గంటలకు సమీక్ష లు నిర్వహిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో రాష్ట్రంలో నాలుగు విడతల రేషన్‌తో పాటు వెయ్యి రుపాయలు పంపిణీ చేశామని పేర్కొన్నారు. ఇంత కఠిన పరిస్థితిలోనూ సీఎం జగన్‌ సంక్షేమ పధకాలు కొనసాగించడం పట్ల ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో వలంటీర్ల వ్యవస్ద చాలా చక్కగా పనిచేస్తుందని వెల్లడించారు. రైతులు పండించిన పంటకు గిట్టు బాటు ధర కల్పించి రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకున్నట్లు సుచరిత పేర్కొన్నారు. ('సొంత పార్టీకి చెందినవాడే దొంగదీక్ష అన్నాడు')

మరిన్ని వార్తలు