అన్ని పథకాల్లోనూ మహిళలకు ప్రాధాన్యత: హోంమంత్రి

24 Apr, 2020 13:35 IST|Sakshi

సాక్షి, గుంటూరు : రాష్ట్రంలోని అక్కా, చెల్లెళ్లు బాగుండాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోరిక అని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఇచ్చిన మాట కోసం  సీఎం వైఎస్‌ జగన్‌ కట్టుబడి ఉంటారని తెలిపారు. కరోనా కష్టకాలంలో మహిళల కోసం రూ. 14 వందల కోట్లు మంజూరు చేశారని ప్రశంసించారు. మహిళలు వృథా ఖర్చులు చేయకుండా కుటుంబానికి అండగా నిలుస్తారు కాబట్టి చాలా పథకాల్లో మహిళలకే ప్రధాన్యత ఇచ్చారన్నారు. సంక్షేమ కార్యక్రమాలను చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. చంద్రబాబు చేయలేని పని వైఎస్‌ జగన్‌ చేస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా మహిళలంతా సంతోషంగా ఉన్నారని సుచరిత అన్నారు. (గర్ల్‌ ఫ్రెండ్‌తో గొడవ.. 22 మంది ప్రాణాలు తీసింది.. !)

కాగా ముఖ్యమంత్రి   వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ‘వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకాన్ని’ క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. నగదు బదిలీ కోసం ఆన్‌లైన్‌ ద్వారా బటన్‌ నొక్కగానే సెర్ప్, మెప్మాల పరిధిలోని గ్రామ, పట్టణ ప్రాంతాల్లో ఉండే 8,78,874 పొదుపు సంఘాల ఖాతాల్లో సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా ఒకే విడతలో డబ్బులు జమ అయ్యాయి. దీంతో  90,37,254 మహిళలు సభ్యులుగా ఉండే ఆయా సంఘాల ఖాతాల్లో రూ.1,400 కోట్లు ఒకే విడత జమ అయ్యాయి. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల నుంచి డ్వాక్రా మహిళలతో సీఎం మాట్లాడారు. (కరోనాపై ఆనాడే స్పందించి ఉంటే.. )

>
మరిన్ని వార్తలు