అగ్నిమాపకశాఖను పటిష్టం చేస్తాం..

22 Dec, 2019 14:10 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: కచ్చలూరు బోట్ ప్రమాద ఘటనలో ఫైర్ సిబ్బంది అందించిన సేవలు గొప్పవని హోంశాఖమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. సుర్యాబాగ్‌లోని మోడల్‌ ఫైర్‌ స్టేషన్‌ను హోంమంత్రి సుచరిత ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అగ్నిమాపకశాఖను మరింత పటిష్టం చేసి సిబ్బంది కొరత లేకుండా చూస్తామని సుచరిత పేర్కొన్నారు. సిబ్బంది కొరత ఉంటే జనవరిలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఆమె వెల్లడించారు. ప్రమాదాలు సంభవింనప్పుడు ఆపన్నహస్తం అందిస్తున్న ఫైర్‌ సిబ్బందికి ఆమె అభినందనలు తెలిపారు. ఫైర్‌ సిబ్బందికి సమస్యలుంటే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని పేర్కొన్నారు. 1942లో స్థాపించబడిన ఫైర్స్టేషన్‌ను రూ. కోటి 24 లక్షలతో వీఎంఆర్డీఏ సహకారంతో కొత్త భవనం సమకూరిందని హోంమంత్రి సుచరిత తెలిపారు.

అగ్ని ప్రమాదాలు జరిగేటప్పుడు 54 మీటర్లు ఎత్తువరకు మంటలను నియంత్రించే ఆధునిక పరికరాలు ఉన్నాయని మంత్రి సుచరిత తెలిపారు. 480 మంది ఫైర్ సిబ్బందిని నియమించామని సుచరిత పేర్కొన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందలనేది  సీఎం వైఎస్ జగన్ ఆలోచన అని ఆమె వ్యాఖ్యానించారు. ప్రాంతీయ వాదాలు రాకూడదనే అన్ని ప్రాంతాలు అభువృద్ధి కోసం సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారని గుర్తుచేశారు. నిపుణుల కమిటీ నివేదికపై సీఎం జగన్‌తో చర్చిస్తామని సుచరిత పేర్కొన్నారున. రైతుల వద్ద తీసుకున్న భూములు ఉన్న ప్రాంతాలో కూడా అభివృద్ధి జరుగుతుందని హోంమంత్రి సుచరిత పేర్కొన్నారు.

ఈ సందర్భంగా విశాఖ వీఎంఆర్డీఏ చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించే అగ్నిమాపక సిబ్బంది సేవలు అభినందనీమని ప్రశంసించారు. అగ్నిమాపక, పోలిసు ఉద్యోగులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు అందిస్తామని ఆయన అన్నారు.

విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రజలు ప్రాణాలు కాపాడటంలో ముందుండే ఫైర్ సిబ్బంది సేవలు అభినందనీయమని కొనియాడారు. హూద్‌హూద్‌లో ఫైర్ సిబ్బంది అందించిన సేవలు మర్చిపోలేమని ఎంవీవీ సత్యనారాయణ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు