మహిళపై లైంగికదాడికి యత్నం

2 Jan, 2014 09:45 IST|Sakshi
మహిళపై లైంగికదాడికి యత్నం

కరీంనగర్ : తాగిన మైకంలో ఓ యువకుడు మహిళపై వికృత చేష్టలకు పాల్పడ్డాడు. తిమ్మాపూర్ మండలం రేణికుంట శివారులోని రామినేని జిన్నింగ్ మిల్లులో ఉత్తరప్రదేశ్కు చెందిన సంజయ్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. నిన్న సాయంత్రం ఇతర కార్మికులతో కలిసి మిల్లు బయట మద్యం సేవించాడు.

కాగా ఆకుకూర ఏరుకుని జీవనం సాగిస్తున్న రేణికుంటకే చెందిన మహిళ మిల్లు పరిసరాల్లోకి వెళ్లింది. ఆమెను చూసిన సంజయ్ పక్కకు లాక్కెళ్లి లైంగికదాడికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించటంతో రెండు చెవులతో పాటు శరీరంపై ఇష్టమొచ్చినట్లు కొరికాడు. వికృత చేష్టలకు పాల్పడ్డాడు. కాగా ఆమె కేకలు విని అటుగా వెళుతున్న గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వెళ్లేసరికి సంజయ్ పరారయ్యాడు.

అతడి వెంటపడి పట్టుకోగా మిల్లలో పనిచేస్తున్న సిబ్బంది నిందితుడిని చితకబాదారు. సమాచారం అందుకున్న గ్రామస్తులు సంజయ్ని గేటుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. పోలీసులకు సమాచారం అందించటంతో నిందితుడిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు