విశాఖలో కూడా మెట్రోరైలు

31 Aug, 2014 15:07 IST|Sakshi
మెట్రలోరైల్

హైదరాబాద్: హైదరాబాద్‌ తరహాలో విశాఖపట్టణంలో సైతం మెట్రోరైల్‌ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది . ఇందుకు సంబంధించి నాలుగు కారిడార్లుగా విశాఖపట్టణాన్ని విభజించారు.  ఒక్కో కారిడార్‌లో 20 కిలోమీటర్ల చొప్పున మొత్తం 80 కిలోమీటర్ల మేర మెట్రోరైల్‌ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్దం చేశారు. ఈ ప్రాజెక్టు పరిశీలనకు ప్రభుత్వం ఏడుగురు సభ్యులతో ఒక కమిటీని నియమించింది.

ఈ మెట్రోరైలు ప్రణాళికకు  ఎపి మంత్రి మండలి ఆమోదం కూడా తెలిపింది. ఢిల్లీ టెక్నికల్‌ ఇంజనీర్‌ టీమ్‌ ఆధ్వర్యంలో ఒక టీమ్‌ను ఏర్పాటు చేసి సర్వే చేయిస్తున్నట్లు ఎపి ప్రభుత్వం తెలిపింది. విజయవాడ - గుంటూరు - మంగళగిరి-తెనాలిలను కలుపుతూ మెట్రోరైలు ఏర్పాట్లకు ఏపి ప్రభుత్వం త్వరలోనే  టెక్నికల్‌ టీమ్‌ ఏర్పాటు చేయనుంది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా