మెట్రో స్టేషన్లు ఖరారు!

30 Dec, 2014 04:48 IST|Sakshi

 సాక్షి, విజయవాడ బ్యూరో : విజయవాడ నగరంలో ప్రతిపాదించిన రెండు మెట్రో రైలు కారిడార్లలో ఎక్కడెక్కడ స్టేషన్లు ఏర్పాటు చేస్తే బాగుంటుందనే అంశంపై ఢిల్లీ మెట్రోరైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) తుది నిర్ణయానికి వచ్చింది. మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి సవివర నివేదిక రూపకల్పనలో భాగంగా డీఎంఆర్‌సీ ఒక కన్సల్టెన్సీతో సర్వే చేయిస్తున్న విషయం తెలిసిందే.

ఈ కన్సల్టెన్సీ బస్టాండ్ నుంచి రామవరప్పాడు రింగురోడ్డు మీదుగా 16వ నంబరు జాతీయ రహదారిపై బెస్ట్ ప్రైస్ షోరూం వరకు 13 మెట్రో స్టేషన్లు, బస్టాండ్ నుంచి కానూరు వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీ వరకు 12 స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించి టోపోగ్రఫీ సర్వే కూడా పూర్తి చేసింది. ఈ ప్రతిపాదనలను పరిశీలించి టోపోగ్రఫీ సర్వే వివరాలను తెలుసుకున్న డీఎంఆర్‌సీ డెరైక్టర్ ఎస్‌డీ శర్మ, డెప్యూటీ జనరల్ మేనేజర్ రాజశేఖర్, చీఫ్ ఆర్కిటెక్ట్ ఖురానా ప్రాథమికంగా అంగీకారం తెలిపినట్లు సమాచారం.

రెండు కారిడార్లలో రోడ్డు ఎంత వెడల్పు ఉందనే విషయాన్ని పరిశీలించారు. స్టేషన్లు ఏర్పాటుచేయాలని ప్రతిపాదించే ప్రాంతాల్లో ట్రాఫిక్, జనసాంద్రత తదితర వివరాలను సేకరించారు. చీఫ్ ఆర్కిటెక్ట్ ఖురానా రైల్వేస్టేషన్‌కు వెళ్లి అక్కడి పరిసరాలను గమనించారు. ఏలూరు రోడ్డు కారిడార్‌లో బస్టాండ్ నుంచి రైల్వేస్టేషన్‌కు లింకు ఎక్కడ, ఎలా కలపాలనే దానిపై ఖురానా చర్చించినట్లు తెలిసింది.

ఆ తర్వాత బృందం క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీఆర్‌డీఏ) ప్రత్యేక కమిషనర్‌కు సర్వే పనులు, ఇతర వివరాలను అందించింది. సర్వే వివరాలు, పరిశీలించిన అంశాలపై బృందం సభ్యులు ఢిల్లీ వెళ్లి డీఎంఆర్‌సీ మాజీ ఎండీ శ్రీధరన్‌తో చర్చించనున్నారు. ఆయన వచ్చే నెల మూడో వారంలో నగరానికి వచ్చి పరిశీలించి ఖరారు చేసే అవకాశం ఉంది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘అది సాహసోపేతమైన నిర్ణయం’

బాధ్యతలు చేపట్టిన ఆర్టీజీఎస్‌ నూతన సీఈవో

పొనుగుపాడు ఘటనపై స్పందించిన హోంమంత్రి

‘చంద్రబాబు డైరెక‌్షన్‌లో మందకృష్ణ మాదిగ’

‘వర్గీకరణకు చంద్రబాబు ఎందుకు ప్రయత్నించలేదు’

వైఎస్సార్‌ విగ్రహానికి పాలాభిషేకం

గత ప్రభుత్వ పాలనపై చర్చకు సిద్ధమా?

వ్యయమా.. స్వాహామయమా..?

వాహన విక్రయాల్లో అక్రమాలకు చెక్‌

అసెంబ్లీలో అనంత ఎమ్మెల్యేల వాణి

సెల్‌ఫోన్‌తో కనిపిస్తే ఫిర్యాదు చేయొచ్చు  

వివాదాస్పద స్థలం పరిశీలన

రూల్స్‌ బ్రేక్‌ .. పెనాల్టీ కిక్‌

‘సహృదయ’ ఆవేదన!

అబ్దుల్‌ కలాంకు సీఎం జగన్‌ నివాళి

పార్టీలకు అతీతంగా నవరత్నాలు : బుగ్గన

అక్రమాలకు కేరాఫ్‌ ఆటోనగర్‌

కల్తీ భోజనంబు..! 

కేశినేని నాని తీవ్ర వ్యాఖ్యలు

నామినేటెడ్‌ పదవుల్లో యాభైశాతం వారికే

థ్యాంక్స్‌ టు జగనన్న

మాట ఇచ్చారు.. నెరవేర్చారు  

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

రూ.కోట్లు కొట్టుకుపోయాయి

ఎయిర్‌ పోర్టు పరిధిలో 144 సెక్షన్‌

షాపింగ్‌కు వెళ్లిన బాలిక అదృశ్యం..!

నీరు–చెట్టు పథకంతో టీడీపీ అవినీతి!

‘ఐలా’ లీలలు!

ఆధునికీకరిస్తే గండికి నీరు దండి

కలెక్టరేట్‌ ఖాళీ 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌.. జాఫర్‌, పునర్నవి సేఫ్‌!

దిల్ రాజు ప్యానల్‌పై సీ కల్యాణ్ ప్యానల్‌ ఘనవిజయం

ఇది ‘మహర్షి’ కలిపిన బంధం

ప్రేమలో పడ్డ ‘చిన్నారి’ జగదీశ్‌!

కన్నడనాట ‘కామ్రేడ్‌’కి కష్టాలు!

హీరోయినా..? ఐటమ్‌ గర్లా?