సూక్ష్మ చిత్రాల కళాకారుడికి ప్రపంచ గుర్తింపు

14 Mar, 2015 18:06 IST|Sakshi
సూక్ష్మ చిత్రాల కళాకారుడికి ప్రపంచ గుర్తింపు

పెనమలూరు : కళాకారుడి శ్రమకు తగిన ప్రతిఫలం 'గుర్తింపు'. కృష్ణా జిల్లా తాడిగడపకు చెందిన కళాకారుడు పామర్తి శివ కృషికి మరోసారి ఈ తరహా గుర్తింపు లభించింది. ఆయన గతంలో చాక్‌పీసులు, కొవ్వొత్తులు, బియ్యపు గింజలు తదితర వస్తువులపై వేసిన సూక్ష్మ చిత్రాలను ప్రపంచ రికార్డుగా లండన్‌కు చెందిన వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించింది. శివకు ప్రశంసాపత్రాన్ని పోస్టు ద్వారా పంపింది. దీంతో శివ ఇప్పటివరకు 16 రికార్డులు కైవసం చేసుకున్నట్లయింది.

మరిన్ని వార్తలు