అర్ధరాత్రి కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ

16 Jul, 2019 08:35 IST|Sakshi
తాళాలు పగులగొట్టి గేట్లను తెరుస్తున్న దృశ్యం

పాణ్యం గిరిజన గురుకుల పాఠశాలకు తాళాలు 

పగులగొట్టించిన కలెక్టర్‌ కనిపించని ప్రిన్సిపాల్, వార్డెన్, నైట్‌ వాచెమెన్, అటెండర్‌ 

తక్షణమే విధుల నుంచి తొలగించాలని ఆదేశం 

పాణ్యం : మండల కేంద్రమైన పాణ్యంలోని గిరిజన సంక్షేమ గురుకుల  (బాలుర)పాఠశాలను సోమవారం అర్ధరాత్రి కలెక్టర్‌ వీరపాండియన్‌ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. కలెక్టర్‌ పాఠశాలకు వచ్చేసరికి ప్రధాన గేట్లు తాళం వేసి ఉన్నారు. ఎంత పిలిచినా సిబ్బంది ఎవరూ బయటకు రాలేదు. దీంతో అరగంట పైగానే కలెక్టర్‌ గేటు బయటే నిల్చున్నారు. చేసేదేమీ లేక కలెక్టర్‌ గన్‌మెన్, అటెండర్‌ గోడలు దూకి తాళాలను పగులగొట్టారు. రెండో ప్రధాన గేటు తాళాన్ని కూడా పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. కలెక్టర్‌ లోపలికి వెళ్లగా కేవలం అందులో విద్యార్థులు మాత్రమే ఉండంతో వారిని నిద్రలేపారు. పాఠశాలలో పని చేస్తున్న వార్డెన్, వాచ్‌మెన్, అటెండర్, ప్రిన్సిపాల్‌ ఇతర సిబ్బంది ఎక్కడ ఉన్నారని ఆరా తీసి వారికి ఫోన్‌ చేశారు. హుటాహుటిన ప్రిన్సిపాల్‌ మేరిసలోమితోపాటు ఇతర సిబ్బంది కలెక్టర్‌ ముందుకు వచ్చారు. ఎందుకు  తాళం తీయలేదని, పాఠశాలలో నైట్‌ వాచ్‌మెన్, ఇతర సిబ్బంది ఎక్కడున్నారని ప్రశ్నించారు. సరైన సమాధానం చెప్పకపోవడంతో తక్షణమే వారిని విధులనుంచి తొలగించాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రిన్సిపాల్‌ సలోమిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.  

మరిన్ని వార్తలు