చెన్నై నుంచి శ్రీకాకుళానికి శ్రామిక్ రైలు‌

12 May, 2020 13:59 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం: చెన్నై నుంచి బయలుదేరిన వలస కార్మికుల శ్రామిక్‌ రైలు శ్రీకాకుళం చేరుకుంది. కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో చెన్నైలో చిక్కుకుపోయిన 889 మంది జిల్లా వాసులు ఈ రైలు ద్వారా  శ్రీకాకుళానికి చేరుకున్నారు. వీరిలో 685 మంది మత్స్యకారులు ఉండగా 204 మంది వలస కూలీలు ఉన్నారు. వలస కూలీలందరిని అధికారులు క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించనున్నారు. చెన్నై నుంచి వచ్చిన వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. వీరి కోసం ప్రత్యేకంగా 30 బస్సులను ఏర్పాటు చేశారు. (కర్నూలు ప్రజలకు భారీ ఊరట)

మే 1 నుంచి వలస కూలీలను వారి వారి స్వగ్రామలకు తరలించడానికి శ్రామిక్‌ రైళ్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అదేవిధంగా  వందేమాతరం మిషన్‌ ద్వారా విదేశాల్లో ఉన్న వారిని కూడా భారతదేశానికి తీసుకువస్తోన్నారు. ఇక ఇప్పటి వరకు భారతదేశంలో కరోనా కేసులు సంఖ్య 70,756 నమోదు కాగా 22, 454 మంది కోలుకున్నారు. ఆంధ్రపదేశ్‌లో ఇప్పటి వరకు 2018 కేసులు నమోదు కాగా, 975 మంది కోలుకున్నారు. (ఆన్లైన్లో బుకింగ్కు సిద్ధం)

మరిన్ని వార్తలు