కృష్ణా జిల్లాలో భూప్రకంపనలు

15 Jan, 2015 08:42 IST|Sakshi

విజయవాడ: కృష్ణా జిల్లాలో కలకలం రేగింది. నందిగామ, కంచికచర్ల ప్రాంతంలో భూ ప్రకంపనలు జనాలను పరుగులు పెట్టించాయి. గురువారం తెల్లవారుజామున దాదాపు కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. అయితే రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత స్వల్పంగా నమోదు కావడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గతంలో భూప్రకంపనలు ఒకసారి 4 సెకన్లు, మరోసారి 3 సెకన్లు నమోదయ్యాయి. ఉదయం వాకింగ్‌, పాల కోసం వెళ్లేవారు ఈ ప్రకంపనల్ని గుర్తించారు. తరచుగా వస్తున్న భూప్రకంపనలతో మున్ముందు పెను ప్రమాదం వాటిల్లే అవకాశముందని స్థానికులు  భయాందోళనలకు గురవుతున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు