డెయిరీ కళకళ

29 Oct, 2014 03:40 IST|Sakshi
డెయిరీ కళకళ

కర్ణాటక నుంచి పాల వెల్లువ
నిత్యం 40 ట్యాంకర్ల  వరకు రాక
ఇప్పటివరకు 60 లక్షల లీటర్లు సరఫరా
పూర్తిస్థాయిలో పనిచేస్తున్న  పాల పొడి ఫ్యాక్టరీ
డెయిరీకి పెరగనున్న ఆదాయం

 
ఒంగోలు డెయిరీకి మంచి రోజు లొచ్చాయి. ఉద్యోగులకు చేతిని ండా పనిదొరికింది. వారానికి రెండు రోజులు పనిచేసే పాల పొడి ఫ్యాక్టరీ గత పదిరోజుల నుంచి పూర్తి స్థాయిలో పని చేస్తోంది. పాల పొడి, వెన్న తయారీ కోసం కర్ణాటక నుంచి పాలు వెల్లువలా వస్తున్నాయి. అక్కడ పాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుండటంతో పాల పొడి తయారీ, వెన్న తయారీ కోసం ప్రకాశం జిల్లా ఒంగోలు డెయిరీకి తెప్పిస్తున్నారు. కనీసం రోజుకు 30 నుంచి 40 ట్యాంకర్లు అక్కడ నుంచి వస్తున్నాయి. కేజీ పాల పొడి తయారీకి రూ.30, కేజీ వెన్న తయారీకి రూ.15 డెరుురీకి చెల్లిస్తారు. ఈ లెక్కన ఒంగోలు డెయిరీకి రోజుకు నాలుగు లక్షల రూపాయలకు పైగా ఆదాయం వస్తుంది. గత పది రోజులుగా కర్ణాటక నుంచి 60 లక్షల లీటర్ల పాలు వచ్చాయి. రూ.45.50 లక్షల వరకు ఆదాయం సమకూరింది.

కర్ణాటక పాలతో కళకళ

జిల్లాలో పాడిపరిశ్రమ గత రెండు, మూడేళ్లుగా తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటోంది. పాల దిగుబడి తగ్గిపోయింది. ప్రస్తుతం డెయిరీకి వస్తున్న పాలకు బయట బాగా డిమాండ్ ఉండటంతో పాల పొడి, వెన్న తయారీకి పాలు మిగలని పరిస్థితి. ఈ నేపథ్యంలో గత పది రోజులుగా ఒంగోలు డెయిరీకి పాల పొడి తయారీ కోసం కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నిత్యం పెద్ద సంఖ్యలో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తోంది. ఫ్యాక్టరీ సామర్థ్యానికి మించి పాల ట్యాంకర్లు వస్తుండటంతో డెయిరీ కళకళలాడుతోంది. ట్యా ంకర్లను నిలిపేందుకు కూడా ఖాళీ లేని పరిస్థితి నెలకొంది.

అన్‌సీజన్‌లో అంతంతమాత్రమే..

ఒంగోలు డెయిరీలో 20 సంవత్సరాల క్రితం రూ.30 కోట్లకు పైగా ఖర్చు చేసి పాల పొడి ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు. రోజుకు మూడు నుంచి నాలుగు లక్షల టన్నుల పాల పొడి, వెన్న తయారుచేసే సామర్థ్యం ఫ్యాక్టరీకి ఉంది. ప్రస్తుతం కర్ణాటక నుంచి వస్తున్న పాల వల్ల ఫ్యాక్టరీ పూర్తిస్థాయిలో పనిచేస్తోంది. సాధారణంగా పాల సీజన్‌లో మాత్రమే ఈ ఫ్యాక్టరీ 24 గంటలూ పనిచేస్తుంది. ఈసారి సీజన్ ప్రారంభమైనా జిల్లాలో పాల ఉత్పత్తి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. వర్షాభావ పరిస్థితులు జిల్లాను వెంటాడుతుండటమే అందుకు కారణం. అన్ సీజన్‌లో అరుుతే ఫ్యాక్టరీ కేవలం వారానికి రెండు రోజులు పనిచేస్తుంది. స్థానిక పాలతో పాల పొడి, వెన్న తయూరుచేస్తుంది. ఫ్యాక్టరీ ఏ మేరకు పనిచేస్తే ఆ మేరకు డెయిరీకి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం కర్ణాటక పాలతో రోజుకి 35 టన్నుల పాల పొడి, 15 నుంచి 20 టన్నుల వెన్న తయారు చేస్తున్నారు. దీంతో ఫ్యాక్టరీ ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అవకాశముంటుందని డెయిరీ ఎండీ శివరామయ్య తెలిపారు.
 
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా