హామీలన్నీ అమలు చేస్తాం

27 Jun, 2016 03:01 IST|Sakshi
హామీలన్నీ అమలు చేస్తాం

జిల్లా ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడు
 
కర్నూలు (టౌన్): కొత్త రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నా ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేరుస్తున్నారని జిల్లా ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఖరీఫ్ సీజన్‌లో రైతాంగానికి సాగునీరు, విత్తన సమస్యలు లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ నెల 28, 29 తేదీల్లో ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందిస్తామన్నారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ 2014 ఆగష్టులో సీఎం చంద్రబాబు రాష్ర్ట ప్రజలకు 17 వరాలు ప్రకటించారని, రెండేళ్ల వ్యవధిలో తొమ్మిదింటిని అమలు చేశారన్నారు.

ఎమ్మిగనూరు టెక్స్‌టైల్స్ పార్కు, ఆవుకు రిజర్వాయర్ వద్ద టూరిస్టు సెంటర్ ఏర్పాటు, బెంగళూరు- చెన్నై కారిడార్, ఓర్వకల్లు వద్ద ఎయిర్‌పోర్టు, కర్నూలు - చిత్తూరు హైవే తదితర అభివృద్ది పనులు మరో 6 నెలల వ్యవధిలో పూర్తవుతాయని చెప్పారు. పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, ఎమ్మెల్యేలు భూమానాగిరెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి, మణిగాంధీ, బిసి. జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు