చేనేత రుణాలు మాఫీ చేశాం : మంత్రి అచ్చెన్నాయుడు

22 Jun, 2018 17:43 IST|Sakshi

సాక్షి, అమరావతి : చేనేత రుణాలను మాఫీ చేశామని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం ఆయన 13జిల్లాల చేనేత సంఘాల నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికులకు 50ఏళ్లకు పెన్షన్లు ఇచ్చామని, అదనంగా మరో 25 వేల పెన్షన్లను ఇస్తామని చెప్పారు. ఆప్కో బకాయిలను వెంటనే చెల్లిస్తామని, వర్షా కాలంటో మగ్గాలు పనిచేయని సమయంలో రెండు నెలలు డబ్బు చెల్లించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. జనతా వస్త్రాలను పునరుద్ధరణకు ప్రయత్నిస్తున్నామని, కార్మికులకు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తిరిగి అమలు చేస్తామని ప్రకటించారు.

రాష్ట్రంలో ఉన్న 24లక్షల మంది చేనేత కార్మికలకు ప్రభుత్వ పథకాలు అందడానికి కార్పొరేషన్, లేదా లేబర్‌ వెల్ఫేర్ బోర్డ్ ఏర్పాటును పరిశీలిస్తున్నామని మంత్రి చెప్పారు. చేనేత కులంలో అందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చూస్తామన్నారు. గత ప్రభుత్వాలు బలహీన వర్గాలను పూర్తిగా విస్మరించాయని అన్నారు. సీఎం మీద కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఇందులో భాగంగానే మత్స్యకారులు, నాయి బ్రాహ్మణల అంశాన్ని రాద్ధాంతం చేశారని మండిపడ్డారు. బీసీ సంక్షేమంపై ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు. రజకులు, మత్స్యకారులకు రిజర్వేషన్లపై అధ్యయనం చేస్తున్నామని వెల్లడించారు.

మరిన్ని వార్తలు