పేపర్‌లో కాదు..ప్రజల్లోకి వెళ్ళి చూడండి

23 Dec, 2019 12:10 IST|Sakshi

మంత్రి ఆదిమూలపు సురేష్‌

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: అభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ధ్వజమెత్తారు. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ..  అధికారంలోకి వచ్చిన ఆరు నెలల కాలంలోనే వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందన్నారు. రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందనేది పేపర్‌లో కాదని, స్వయంగా ప్రజల మధ్యకు వెళ్ళి చూసి ప్రభుత్వానికి మద్దతు పలకాలని ప్రతిపక్షాలకు సూచించారు.

ప్రతిపక్ష నేతల పిల్లలు మాత్రం ఇంగ్లీష్‌ మీడియంలో చదవొచ్చు... కానీ పేదోళ్ల పిల్లల మాత్రం ఇంగ్లీష్‌ పాఠశాలలో చదవకూడదా అని మంత్రి సూటిగా ప్రశ్నించారు. ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా సీఎం నెరవేర్చుతున్నారని తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌తో ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 వేల మందికి ఉపాధి  లభిస్తుందన్నారు. ఏడాదికి 3 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల ఐరన్‌ ఉత్పత్తి జరుగుతుందన్నారు. దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టేందుకు సీఎం జగన్‌ కృషి చేస్తున్నారన్నారు. అన్ని జిల్లాల అభివృద్ధిపై  ముఖ్యమంత్రి దృష్టి పెట్టారని మంత్రి ఆదిమూలపు పేర్కొన్నారు.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు