చంద్రబాబు తప్పించుకోలేరు..!

16 Feb, 2020 17:56 IST|Sakshi

మంత్రి ఆదిమూలపు సురేష్‌

సాక్షి, విజయవాడ: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతి బాగోతం పై ఈడీ దర్యాప్తు చేయాలని మంత్రి ఆదిమూలపు సురేష్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. అక్రమాలు జరిగాయని ఐటీ శాఖ స్పష్టంగా ప్రకటనలో వివరించిందని.. దీని నుంచి తప్పించుకోవడం ఆయన తరం కాదని పేర్కొన్నారు. ‘నలభై ప్రాంతాల్లో దాడులు నిర్వహించామని.. రెండు వేల కోట్లకు పైగా అవకతవకలు జరిగాయని, దేశంలోనే అత్యున్నత సంస్థ అయిన సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్సెస్‌ అధికారిణి ప్రకటన విడుదల చేసిందని’ మంత్రి తెలిపారు.(ఐటీ ఉచ్చులో అవినీతి చక్రవర్తి)

ఆ డాక్యుమెంట్లు,లాకర్లు ఎవరివి..
‘ఆయా కంపెనీలు, శ్రీనివాస్‌ ఇంట్లో దొరికిన డాక్యుమెంట్లు,లాకర్లు ఎవరివి. ప్రకటనలో పేర్కొన్న బినామీ కాంట్రాక్టర్లు, ఇన్ఫ్రా కంపెనీలకు, ఆయనకు సంబంధం ఏమిటి’ అని మంత్రి ప్రశ్నించారు. తప్పును కప్పిపుచ్చుకోవడానికి పచ్చ మీడియా ద్వారా ఏమీ జరగలేదంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దాడులు జరిగి పది రోజులు కావస్తున్నా.. ఎందుకు చంద్రబాబు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ‘మాజీ పీఎస్‌ ఇంట్లో సోదాలు జరిగితే మాకేం సంబంధం అన్న వారు..ఇప్పుడు ఎందుకు రెండు లక్షలే దొరికాయంటూ కొత్త పల్లవి అందుకున్నారని మంత్రి ఆదిమూలపు దుయ్యబట్టారు.
(ఆర్‌కే ఇన్‌ఫ్రా అక్రమాలెన్నో..?)

మరిన్ని వార్తలు