రైతుల సేవలో భరోసా కేంద్రాలు..

31 May, 2020 14:56 IST|Sakshi

సాక్షి, ప్రకాశం జిల్లా: అధికారంలోకి  వచ్చిన ఏడాదికాలంలోనే 90 శాతం హామీలు పూర్తి చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. పుల్లల చెరువు మండలం మానేపల్లిలో రైతు భరోసా కేంద్రాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పోలా భాస్కర్, అధికారులు, వైఎస్సార్‌సీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు మాట్లాడుతూ కుల,మత,పార్టీలకు అతీతంగా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ‘‘ ఏడాది పూర్తి కాగానే సంబరాలు చేసి కోట్లు ఖర్చు చేయలేదు. ‘మన పాలన​- మీ సూచన’ వినూత్న కార్యక్రమం చేపట్టి సూచనలు తీసుకుంటున్నామని’’ చెప్పారు. (చంద్రబాబుపై కేసు నమోదు)

యర్రగొండపాలెం నియోజకవర్గం పరిధిలో నీటి సమస్య అధికమని, కేవలం వర్షాధార పంటలే రైతులు పండిస్తారన్నారు. రైతుల సేవలో రైతు భరోసా కేంద్రాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. తీగలేరు కాలువ పనులు కోసం నిధులు ఇచ్చేందుకు సీఎం జగన్‌ అంగీకరించారని.. దీనివల్ల పుల్లల చెరువు మండలంలో 11,500 ఎకరాలు సాగులోకి వస్తాయని తెలిపారు. గతంలో రైతే రాజు అంటూ దివంగత మహానేత వైఎస్సార్‌ ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని, నేడు ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌ కూడా రైతును రారాజుగా చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నారని ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. ('టీడీపీ మహానాడు ఓ పెద్ద మాయ')

మరిన్ని వార్తలు