‘మన బడి నాడు -నేడు’ పై మంత్రి సమీక్ష

27 Jun, 2020 14:51 IST|Sakshi

విద్యార్థుల కోసం టోల్‌ఫ్రీ నంబర్‌ విడుదల చేసిన మంత్రి సురేష్‌

సాక్షి, అమరావతి: ఆగస్టు చివరి నాటికి పాఠశాలలను తెరిచే ఆలోచనలో ఉన్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. శనివారం ఆయన సమగ్ర శిక్ష అభియాన్ కార్యాలయంలో ‘మన బడి నాడు -నేడు’ పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్ధుల కోసం టోల్‌ఫ్రీ నంబర్‌ విడుదల చేసిన మంత్రి.. ఏ సమస్య ఉన్నా ‘1800 123 123 124’ నంబర్‌కు ఫోన్‌ చేయొచ్చని తెలిపారు. కార్పొరేట్‌ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను సిద్ధం చేస్తున్నామని ఆయన వెల్లడించారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే విద్య, వైద్యం, వ్యవసాయానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చాలన్నదే సీఎం లక్ష్యంగా పెట్టుకున్నారని పేర్కొన్నారు. మరుగుదొడ్లు, టేబుల్స్‌, తాగునీరు, ప్రహరీగోడలు వంటి తొమ్మిది అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. కావాల్సిన పరికరాలకు టెండర్‌ ప్రక్రియ ఖరారు చేశామని ఆయన వెల్లడించారు. (టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం)

రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రూ.143 కోట్లు ఆదా..
రివర్స్ టెండర్లు ద్వారా రూ.143 కోట్లు ఆదా చేస్తూ కోడ్ చేశామని మంత్రి  తెలిపారు. ప్రతి శనివారం ‘మన బడి నాడు- నేడు’పై సమీక్ష నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు రూ.504 కోట్లు పైగా ఖర్చు చేశామని పేర్కొన్నారు. రూ. 710 కోట్లు రివాలింగ్‌ ఫండ్‌ తీసుకువచ్చామని తెలిపారు. పాఠశాలలు తెరిచేలోగా ఆధునీకరణ పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు. కోర్టు వివాదాలు పరిష్కరం అవగానే డిఎస్సీ నోటిఫికేషన్‌ ప్రకటిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు హెడ్మాస్టర్ లు అందరికి ప్రత్యేకంగా ఒక టోల్ ఫ్రీ నంబర్ త్వరలో ఏర్పాటు చేస్తామని మంత్రి సురేష్‌ పేర్కొన్నారు. 
 

మరిన్ని వార్తలు