మంత్రిని నిలదీసిన ప్రజలు

21 Jul, 2018 08:11 IST|Sakshi
రేషన్‌ కార్డులు,భూముల ఆన్‌లైన్‌ సమస్యలపై మంత్రి ఆదిని చుట్టుముట్టిన ప్రజలు

సాక్షి, కలసపాడు : గ్రామదర్శిని పేరుతో వైఎస్సార్‌ కడప కలసపాడులో టీడీపీ చేపట్టిన ప్రచారంలో ప్రజల నుంచి ఆందోళన వచ్చింది.మంత్రి ఆదినారాయణరెడ్డి మాట్లాడుతున్న సమయంలో ప్రజలు సమస్యలు లేవనెత్తారు.మండంలో భూ సమస్యలు పేరుకుపోయాయని వాటిని పరిష్కరించేందుకు తహసీల్దార్‌ చర్యలు తీసుకోవడంలేదని మంత్రికి తెలిపారు. డబ్బులు ఇవ్వకపోతే ఆన్‌లైన్‌ చేయడం లేదని, ఒకరి భూమిని మరొకరి పేరుతో ఆన్‌లైన్‌చేసి దానిని సవరించేందుకు వేల రూపాయలు గుంజుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంత్రి ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ రేషన్‌కార్డులు అర్హులకు అందిస్తున్నామని చెప్పగా మహిళలు లేచి ఎక్కడ ఇస్తున్నారని మంత్రి ఆదిని ప్రశ్నించారు. వెంటనే మంత్రి తహసిల్దార్‌ను పిలిచి సమాధానం చెప్పమని ఆదేశించారు. మీరు చేసే తప్పులకు మేం ప్రజలతో మాటలు పడాలా అంటూ తహసీల్దార్‌ రాజేంద్రపై ఆగ్రహంవ్యక్తంచేశారు.ఈ సందర్భంగా మంత్రి ఆది మాట్లాడుతూ వారం రోజుల్లో ఆన్‌లైన్‌ సమస్యలు పరిష్కరిం చకపోతే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.అంతకుముందు చెత్త నుంచి సంపద చేసే కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

∙కలసపాడులో ప్రవహిస్తున్న తెలుగు గంగ ఎడమ ప్రధాన కాలువకు మాజీ మంత్రి బిజవేములు వీరారెడ్డి పేరును పెట్టారు. దీనిపై విమర్శలు Ðð వెళ్లువెత్తాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి తెలుగుగంగ కాలువ త్వవించి గంగనీరు విడుదల చేస్తే ఆయన పేరు పెట్టకపోవడంపై పలువరు విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో బద్వేల్‌ మార్కెటు యార్డు చైర్మెన్‌ రంతు, టీడీపీ నాయకులు రెడ్డెం వెంకటసుబ్బారెడ్డి తదిరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు