-

ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

26 Mar, 2020 14:37 IST|Sakshi

సాక్షి, గుంటూరు:  రాష్ట్ర వ్యాప్తంగా 332 కరోనా వైరస్‌ సాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించామని, 289 నెగిటివ్‌ రిపోర్టులు రాగా మరో 33 రిపోర్టులు రావాల్సి ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  కరోనాపై ప్రజలు ఆందోళ చెందాల్సిన అవసరం లేదని, కరోనా పరీక్షల కోసం రాష్ట్రంలో 4 ల్యాబ్‌లు పని చేస్తున్నాయని తెలిపారు. అంతేగాక  గుంటూరు, వైజాగ్‌, కడపలో అదనంగా కొత్తగా ల్యాబ్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు కూడా చెప్పారు. ఇక గుంటూరులో నమోదైన మొదటి కరోనా పాజిటివ్‌ కేసు వ్యక్తి బంధువులైన అయిదుగురిని అనుమానంతో ఆసుపత్రి తరలించామని మంత్రి తెలిపారు. (సామాజిక దూరాన్ని పాటించాలి)

అతేగాక ఆ వ్యక్తి ప్రయాణించిన 16 మంది తోటి ప్రయాణికులను, దగ్గరగా తిరిగిన మరో 13 మందిని వారి హౌస్‌ క్వారంటైన్‌కి తరలించామన్నారు. ఇక  కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్‌ డౌన్‌కు ప్రజలు సహకారాన్ని అందించాలని, ప్రజల సహకారంతోనే కరోనా నిర్మూలన చేయగలమన్నారు. గుంటూరులో అదనంగా 14 రైతు బజార్లు  ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇక 60 ఏళ్లు దాటివ వారెవరూ బయటకు రావద్దని సూచించారు. వచ్చే నెల రేషన్‌ను 29 తేదినే ఇవ్వడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. (డాక్టర్‌కు కరోనా.. క్వారంటైన్‌లోకి 900 మంది)

కృష్ణాజిల్లా: జగ్గయ పేట పట్టణంలో అల్ట్రాటెక్‌ సిమెంటు వారి సహకారంతో  ఏర్పాటు చేసిన లిక్వడ్‌ బ్లీచింగ్‌ను ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను, మున్సిపల్‌ కమిషనర్‌ రామ్మోహన్‌ పట్టణ వీధులలో చల్లించారు.

మరిన్ని వార్తలు