త్వరలోనే రాజధానిపై స్పష్టత

7 Nov, 2019 19:26 IST|Sakshi

మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌

సాక్షి, కర్నూలు: రాష్ట్రంలో ప్రతి పాఠశాల రూపురేఖలు మారబోతున్నాయని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 14 నుండి నాడు-నేడు పథకం ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల మరమ్మతులకు నిధులను విడుదల చేశామని పేర్కొన్నారు. ‘అనేక పోరాటాలు చేసిన అగ్రిగోల్డ్‌ బాధితులను గత టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని.. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకున్నారని’ చెప్పారు.

గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు..
గుండ్రేవుల ప్రాజెక్టు అంశంపై ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారని.. త్వరలోనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.  రాజధాని పై శివరామకృష్ణన్ కమిటీ నివేదికను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. రాజధాని అంశంపై వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కమిటీని నియమించిందన్నారు. ఈ కమిటీ అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాత నివేదిక అందిస్తుందని..దాన్నిబట్టే రాజధాని ఎక్కడ అనేది స్పష్టత వస్తుందని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు