‘1270 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాం’

19 Mar, 2020 15:28 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు అతిగా భయపడోద్దని, అదే విధంగా అజాగ్రత్తగా కూడా ఉండొద్దని మంత్రి అవంతి శ్రీనివాస్‌ హెచ్చారించారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జిల్లాలో కరోనా వ్యాప్తి చెందకుండా చెందకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైల్వే,బస్సు స్టేషన్‌లలో స్కీనింగ్ నిర్వహించే విధంగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పాడేరు, అరుకులో ఐసోలేషన్ వార్డులను అందుబాటులోకి తీసుకువస్తున్నామని చెప్పారు. అంతేగాక ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.

కరోనాపై పోలీస్‌ శాఖ అప్రమత్తం

ఇక కరోనా వైరస్ నిర్ధారించే యంత్రం​ కేజిహెచ్‌ను త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వివిధ రూపాల్లో ప్రజలకు అవగాహన కార్యాక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.  ప్రజలు కరోనా బారిన పడకుండా వ్యక్తిగతంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక కలెక్టర్‌ వినయ్‌ చంద్‌ మాట్లాడుతూ.. నిన్న(బుధవారం) విశాఖ ఎయిర్‌పోర్టుకు వచ్చిన 185 మంది ప్రయాణికులకు కూడా హూమ్‌ క్వారంటైన్‌లో ఉంచుతున్నామని చెప్పారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారమే కరోనా లక్షణాలు లేని వారిని వాళ్ళ ప్రాంతాలకు పంపిస్తున్నామన్నారు. ఇక ప్రస్తుతం జిల్లాలో ఆరు అనుమానిత కేసులు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. (శానిటైజర్‌ తయారీకి కావాల్సినవి..)

అలాగే విశాఖ పోర్టు చైర్మన్ కె. రామ్మోహనరావు కరోనా పై విశాఖ పోర్టులో అప్రమత్తంగా ఉన్నామన్నారు.  ఇప్పటివరకు వివిధ దేశాల నుంచి 59 నౌకలు విశాఖ తీరానికి వచ్చాయని, ఆ నౌకలలో సిబ్బందికి ప్రత్యేకంగా వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. నౌకలు విశాఖ తీరానికి చేరుకోవడానికి 15 నాటికల్ మైళ్ల దూరం ముందే మాకు సమాచారం వస్తుందని,  అందులో పనిచేస్తున్న విదేశీ సిబ్బందులేవరినీ బయటకి రాకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. షిప్‌లోని సిబ్బంధికి తామే ఆహారం అందిస్తున్నామని,ఇప్పటివరకు దాదాపు 1270 మంది సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించి కరోనా ప్రభావం లేదని‌ నిర్ధారించికున్నామన్నారు. (కరోనా నివారణకు ఢిల్లీ కమిషనర్‌ ఆదేశాలు)

చైనా, సింగపూర్ తదితర ప్రభావిత దేశాల నుంచి‌ వచ్చిన 8 నౌకలను కూడా పూర్తిగా పరీక్షించామని, కేంద్ర ఆరోగ్య శాఖ సూచనలు‌మేరకు కరోనాపై నిరంతరం అప్రమత్తత కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ఇక వైద్య పరీక్షల నిమిత్తం పది మంది సిబ్బంది చొప్పున మూడు వైద్య బృందాలను ప్రత్యేకంగా స్క్రీనింగ్ నిర్వహించడానికి ఏర్పాటు చేశామన్నారు. వైద్య పరీక్షల తర్వాతే పోర్టులో లోడింగ్, అన్ లోడింగ్ చేస్తున్నామని,  గతంలో షిప్‌లో అన్ లోడింగ్‌కు రెండు , మూడు రోజుల సమయం పట్టేదని.. ఇపుడు వైద్య పరంగా తీసుకుంటున్న జాగ్రత్తలతో వారం రోజుల వరకు సమయం పడుతోందని ఆయన అన్నారు. (తల్లి.. బిడ్డలు.. మధ్య కరోనా!)

మరిన్ని వార్తలు