ఘనంగా మన్యం వీరుడి జయంతి ఉత్సవాలు

2 Jul, 2019 19:47 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలను జూలై 4వ తేదీన విశాఖలో ఘనంగా నిర్వహిస్తామని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ తెలిపారు. కొత్త జిల్లా ఏర్పడితే దానికి అల్లూరి పేరు పెడతామని హామీ అన్నారు. జిల్లాలో మంగళవారం  ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు ఆర్జీఎల్‌ విత్తనాల కొరత రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని  తెలిపారు. నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువుల బెడద లేకుండా చర్యలు చేపట్టామని వెల్లడించారు.  

సాగు, తాగు నీటి అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించి విశాఖ జిల్లాలో వెయ్యి కోట్ల రూపాయలతో డీపీఆర్‌ సిద్దం చేస్తున్నట్టు పేర్కొన్నారు. వైఎస్‌ఆర్‌ రైతు భరోసాను తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తుందని స్పష్టం చేశారు. అమ్మ ఒడి పథకం ప్రైవేటు స్కూళ్లకు కూడా వర్తించడం పట్ల దురుద్దేశాలు ఆపాదించవద్దన్నారు. ప్రైవేటు స్కూళ్లు వసూలు చేసే ఫీజులకు తాము వ్యతిరేకమని.. అందులో చదివే విద్యార్థులకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ఫీజు నియంత్రణ కమిటీ తీసుకువచ్చి తల్లిదండ్రులకు ఆర్థిక భారాన్ని తొలగిస్తామని అన్నారు.

మరిన్ని వార్తలు