మంత్రి బొజ్జల ఆదేశాలకు చుక్కెదురు!

20 Sep, 2014 04:04 IST|Sakshi
  • బెరైడ్డిపల్లె పీఏసీఎస్ పీఐసీలు విధాన నిర్ణయాలు తీసుకోకూడదు
  • ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలి
  • ప్రభుత్వం కౌంటర్ దాఖలకు రెండు వారాల గడువు
  • ఆదేశాలిచ్చిన హైకోర్టు ధర్మాసనం
  • పలమనేరు: పీఏసీఎస్‌లకు పర్సన్ ఇన్‌చార్జి కమిటీలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర సహకారశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి జారీ చేసిన అదేశాలకు కోర్టులో చు క్కెదురు అరుు్యంది. పలమనేరు నియోజకవర్గంలోని బెరైడ్డిపల్లె ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం(పీఏసీఎస్)లో ఇటీవల  ఏర్పాటైన పర్సన్ ఇన్‌చార్జ్ కమిటీ(పీఐసీ)లు తదుపరి ఉత్తర్వులు వచ్చేదాకా ఆ పీఏసీఎస్‌కు సంబంధించి ఎటువంటి విధానపరమై న నిర్ణయాలు తీసుకోరాదని హైకోర్టు ధర్మాసనం తీ ర్పు నిచ్చింది. ఆ మేరకు ఈ ఉత్తర్వు కాపీలు శుక్రవా రం పిటీషనర్‌తో పాటు కలెక్టర్, జిల్లా సహకార శాఖ అధికారి తదితరులకు అందాయి.

    బెరైడ్డిపల్లె పీఏసీఎస్ కి సంబంధించి మంత్రి ఆదేశాలతో ఏర్పాటైన పీఐసీల నియమాపకం న్యాయసమ్మతం కాదని బెరైడ్డిపల్లెకు చెందిన వైఎస్సార్‌సీపీ నేత మొగసాల కృష్ణమూర్తి హై కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కో ఆపరేటివ్ కార్యదర్శి, కమిషనర్ అండ్ రిజిస్ట్రార్ ఆఫ్ కో-ఆపరేటివ్ సొసైటీస్, కలెక్టర్, జిల్లా సహకారశాఖ అధికారి, సంబంధిత పీఏ సీఎస్ కార్యదర్శి, పీఐసీ సభ్యులు సుబ్రమణ్యం, అమరనాథరెడ్డి, రాజగోపాల్‌ను ప్రతివాదులుగా చేస్తూ రిట్ పిటిషన్ (డబ్ల్యూపీ 27269/14) దాఖలు చేశారు.

    ఈ పీఏసీఎస్‌కు సంబంధించి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రి కృష్ణారెడ్డి ఆదేశాలతో జరగాల్సిన ఎన్నికలు వా యిదా పడ్డాయని, ఆపై ఈ ఏడాది జూలై 4న ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైతే జూలై 28న మంత్రి గోపాలకృష్ణారెడ్డి ఆదేశాలతో ఇవి వాయిదా పడ్డాయని అందులో పేర్కొన్నారు.

    ఒక్కసారి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తరువాత మధ్యలో వాయిదా ఆదేశాలు చె ల్లవని సహకార శాఖలోని జీవోఎం ఎస్ నెంబర్ 150 చెబుతోందని తన వాదనలో పేర్కొన్నారు. వీటిని వి న్న జస్టిస్ రాజశేఖరరెడ్డి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక తిరిగి వాయిదా వేయాల్సిన అవసరమేముందని, ఈ ఎన్నికల ప్రక్రియ ఎక్కడ ఆగిందో అ క్కడి నుంచి తిరిగి కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు.

    అలాగే ప్రస్తుతం ఏర్పాటైన పీఐసీ సభ్యులు సంఘానికి సంబంధించిన ఎటువంటి విధానపరమైన నిర్ణయాల్లో జోక్యం చేసుకోరాదని ఆదేశించింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం రెండు వా రాల్లో కౌంటర్ దాఖలు చేయాలని అందులో పేర్కొం ది. దీంతో  సహకారశాఖ మంత్రి బొజ్జలకు చుక్కెదురైంది. మరోవైపు మంత్రి ఆదేశాలతో వాయిదాపడిన బయప్పగారిపల్లె పీఏసీఎస్‌పై కూడా కొందరు కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు.
     

మరిన్ని వార్తలు