మంత్రికి ఘన స్వాగతం

27 Jun, 2019 20:57 IST|Sakshi

సాక్షి, విజయనగరం : మంత్రి హోదాలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ తొలిసారిగా తన సొంత నియోజకవర్గం చీపురుపల్లిలో పర్యటించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కేబినెట్‌లో రాష్ట్ర పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గురువారం చీపురుపల్లికి వచ్చారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ సీపీ శ్రేణులు, అభిమానులు భారీ ర్యాలీతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం బొత్స సత్యనారాయణ దంపతులు చీపురుపుల్లిలోని కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్యక్రమాల నిమిత్తం మంత్రి ట్రాక్టర్లు పంపిణీ చేశారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు