కర్నూలులో సున్నా వడ్డి పథకాన్ని ప్రారంభించిన మంత్రి

24 Apr, 2020 18:22 IST|Sakshi

సాక్షి, కర్నూలు: రాష్ట్రంలో లోటు బడ్జేట్‌లో ఉన్నప్పటికీ పొదుపు సంఘాలను ఆదుకున్న నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. ఆలూరులో వైఎస్సార్‌ సున్నా వడ్డి పథకాన్ని మంత్రి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పాదయాత్రలో మహిళలకు ఇచ్చిన మాట నెరవెర్చిన నాయకుడు సీఎం జగన్‌ అన్నారు. రాష్ట్రంలోని అన్ని పొదుపు సంఘాల కోసం రూ.1400 కోట్ల నిధులు కేటాయించారని తెలిపారు. ఇక కరోనా మహమ్మారిని బారిన పడకుండా రక్షించుకోవాలంటే ప్రజలంతా సామాజిక దూరం పాటిస్లూ స్వీయ నిర్భంధంలో ఉండాలిన సూచించారు. కాగా జిల్లాలో కరోనా బాధితులు పెరగడంతో కర్నూలుపై ప్రత్యేక దృష్టి పెట్టి జిల్లా అధికారులతో సీఎం జగన్‌ సమీక్షలు నిర్వహిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు