విద్యుత్‌ తీగల కింద నిర్మించే ఇళ్లకు అనుమతులు లేవు..

23 Feb, 2020 19:59 IST|Sakshi

సాక్షి, నల్గొండ: విద్యుత్‌ తీగల కింద నిర్మించ తలపెట్టిన భవన నిర్మాణాలకు అనుమతులు రావని.. ప్లాట్లు కొనుగోలు చేసేటప్పుడే కొనుగోలు దారులు దృష్టిలో పెట్టుకోవాలని మంత్రి జగదీష్‌ రెడ్డి సూచించారు. ఆదివారం నల్గొండలో పట్టణ ప్రగతిపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో కూడా ఇలాంటి అనుమతులు లేవన్నారు. ప్రస్తుతం ఇళ్ల మీద విద్యుత్‌ తీగల తొలగింపుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అంగీకరించారని వెల్లడించారు. పట్టణ ప్రగతిలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యుత్‌ తీగల తొలగింపుకు అంచనాలు సిద్ధం చేస్తున్నామన్నారు. అందుకు అవసరమైన నిధులు కేటాయించడానికి సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారని మంత్రి జగదీష్‌ రెడ్డి  పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు