-

‘ప్రజలకు, ఉద్యోగులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి’

1 Jul, 2020 20:47 IST|Sakshi

సాక్షి, విజయవాడ: అధికారం కట్టబెట్టలేదని ప్రజలపై చంద్రబాబు నాయుడు కక్ష సాధిస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. బుధవారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ, ప్రజలకు, ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగించేలా అప్రాప్రియేషన్ బిల్లు ఆమోదం కాకుండా టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. దీని వల్ల సకాలంలో జీతాలివ్వలేకపోయాం. ఓటమిని జీర్ణించుకోలేకే చంద్రబాబు ఈవిధంగా వ్యవహరిస్తున్నారు. బిల్లులను అడ్డుకోవడమే లక్ష్యంగా సభలో తెలుగుదేశం పార్టీ వ్యవహరించింది. బిల్లును ఉద్దేశ్యపూర్వకంగానే అడ్డుకుంది. ఈ విషయంలో ప్రజలకు, ఉద్యోగులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్‌ చేశారు.  (ఆ ముగ్గురు నేతలకు కీలక బాధ్యతలు)

ఇంకా ఆయన మాట్లాడుతూ, ‘క్షమాపణ చెబితే చంద్రబాబు సీనియార్టీని కాపాడుకున్న వారవుతారు. ఎక్కువ కాలం సీఎంగా, ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు... ఉద్యోగుల జీతాలను అడ్డుకుని ఆ విషయంలో కూడా చరిత్ర సృష్టించారు. పేదల సంక్షేమంపై చిత్తశుద్ది ఉంది కాబట్టే ఫించన్లు ఇవ్వగలిగాం. నగదు రూపంలో డ్రా చేసి.. ఫించన్లు అందివ్వగలిగాం. కానీ ఉద్యోగుల జీతాలను ఈ విధంగా అందివ్వలేం.  పొగాకు కొనుగోళ్లను తొలిసారిగా ప్రభుత్వమే కొనుగోళ్ల చేసే ప్రక్రియ ప్రారంభించింది. రైతులకు నష్టం లేకుండా చర్యలు చేపట్టాం.  రైతు భరోసా కేంద్రాలను మార్కెటింగ్ కేంద్రాలుగా మార్చే ప్రక్రియను చేపట్టనున్నాం’ అని తెలిపారు. (ఏపీ ప్రభుత్వంపై ప్రశంసల జల్లు)

మరిన్ని వార్తలు