ఆ వెబ్‌సైట్‌ ద్వారా రైతుల నుంచి నేరుగా కొనుగోలు

20 May, 2020 11:38 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు పంటల ధరలు పడిపోకుండా కొనుగోలు చేయడం జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. ధరల స్థిరీకరణ నిధి నుంచి వెయ్యి కోట్లు ఖర్చు చేసి రైతులను ఆదుకున్నామని చెప్పారు. బుధవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ... రైతులు పండించిన పండ్లు, కూరగాయలు విక్రయించేందుకు కల్ గుడి యాప్ అవిష్కరించాం. ఆంధ్ర గ్రీన్స్ ఆన్ లైన్ వెబ్ సైట్  ద్వారా రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి వినియోగదారుల అందజేయనున్నాం. దళారీ వ్యవస్థను రూపుమాపేందుకు ఆంధ్ర గ్రీన్స్ ఆన్ లైన్ వ్యవస్థ ఉపయోగ పడుతుంది.

ఇప్పటికే స్విగ్గీ, జొమోటో ద్వారా పండ్లు కూరగాయల విక్రయాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 8 లక్షల 11 వేల ఫ్రూట్స్ కిట్స్ ఇంటింటికి పంపిణీ చేయడం జరిగింది. ధాన్యం కొనుగోలుకు 4 వేల కోట్లు ఖర్చు చేశాం​. రైతు భరోసా కేంద్రాలు రైతులకు నాలెజ్డ్ సెంటర్లు గా ఉపయోగపడతాయి.కరోనా నేపథ్యంలో తాత్కాలికంగా వేరే చోట నుంచి కార్యకపాలు నిర్వహిస్తున్నాం. త్వరలోనే గుంటూరు మార్కెట్ యార్డ్ ప్రారంభిస్తాంఅని మంత్రి కన్నబాబు తెలిపారు.

(విజయవాడ చేరుకున్న 156 మంది ప్రవాసాంధ్రులు)

మరిన్ని వార్తలు