చంద్రబాబూ.. అసత్య ప్రచారాలు మానుకో

9 Apr, 2020 16:03 IST|Sakshi

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు

సాక్షి, తాడేపల్లి: ఓ వైపు కరోనా నియంత్రణకు చర్యలు తీసుకుంటూనే మరో వైపు రైతులకు న్యాయం జరిగేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. గురువారం ఆయన సాక్షితో మాట్లాడుతూ.. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలులో ఎక్కడా ఇబ్బంది రాకూడదని సీఎం ఆదేశించారని పేర్కొన్నారు. ఇప్పటికే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. అరటిని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేందుకు పూర్తి చర్యలు తీసుకున్నామని కన్నబాబు వివరించారు. (క‌రోనా : పాకిస్తాన్‌లో ఒక్క‌రోజే 248 కొత్త కేసులు)

స్వయం సహాయక సంఘాల ద్వారా పండ్ల అమ్మకాలు చేపట్టేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇన్ని చేస్తుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు హోం క్వారంటైన్‌లో కూర్చుని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన అక్కడే రెస్ట్‌ తీసుకుంటే మంచిదని.. ప్రజల బాగోగులు తాము చూసుకుంటామన్నారు. కరోనా ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే సోకినట్లు ఆయన బాధ పడిపోతున్నారని విమర్శించారు. కరోనా నివారణకు ముఖ్యమంత్రి అన్ని చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు లేఖలు రాయడం మాని సంతోషంగా రెస్ట్‌ తీసుకోవాలని మంత్రి కన్నబాబు ఎద్దేవా చేశారు. (కరోనా : ఆరు నెలల్లో తొలి వ్యాక్సిన్ సిద్ధం)

మరిన్ని వార్తలు