కంపెనీలకు కాదు.. రైతులకు మేలు జరగాలి..

23 Sep, 2019 20:43 IST|Sakshi

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు

సాక్షి, అమరావతి: కర్నూలు జిల్లా సీడ్‌ పార్క్‌ను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. సోమవారం అయోవా యూనివర్శిటీ ప్రతినిధులతో మంత్రి కన్నబాబు, సీఎం కార్యాలయం అధికారులు భేటీ అయ్యారు. కర్నూలు జిల్లా సీడ్‌ పార్క్‌పై సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విత్తన కంపెనీలకు మేలు చేసేలా కాకుండా.. రైతులకు మేలు చేసేలా విత్తనాభివృద్ధి జరగాలని కోరారు. అదే విషయాన్ని ఆయోవా ప్రతినిధులకు సూచించినట్లు వెల్లడించారు. సీడ్‌పార్క్‌ ప్రతిపాదనలను రిడిజైన్‌ చేయాలని చెప్పామన్నారు. రాష్ట్రంలో పరిస్థితులకు అనుగుణంగా విత్తనాభివృద్ధి చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన రైతు పథకాలను చూసి అయోవా ప్రతినిధులు ఆశ్చర్యం వ్యక్తం చేశారన్నారు. విత్తనాలు అందించడానికి ల్యాబ్‌లను పెడుతున్నామని తెలిపారు.
 

మరిన్ని వార్తలు