'వీఆర్ఏలను రికార్డు అసిస్టెంట్లుగా నియమిస్తాం'

11 May, 2016 18:46 IST|Sakshi

హైదరాబాద్: ఉద్యోగులపై క్రిమినల్ కేసులు పెట్టకుండా చర్యలు తీసుకుంటామని ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు. రెవెన్యూ ఉద్యోగుల సమస్యలపై ఆయన బుధవారం ఇక్కడ సమీక్ష నిర్వహించారు. కొత్త అర్బన్ మండలాల ఏర్పాటును పరిశీలిస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. ప్రతి మూడు లక్షల మందికి ఒక తహశీల్దార్ ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. రెవెన్యూ శాఖలో ఖాళీల భర్తీకి చర్యలు చేపడుతున్నామని అధికారులకు తెలిపారు. ఇకపై రెవెన్యూ ఉద్యోగులకు కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి స్పష్టం చేశారు. ఉన్నత విద్యార్హత గల వీఆర్‌ఏలను రికార్డు అసిస్టెంట్లుగా నియమిస్తామన్నారు. కొత్త తహశీల్దార్లు ఏజెన్సీలో పనిచేసేలా నిబంధలు తీసుకొస్తామని చెప్పారు.

మరిన్ని వార్తలు