‘నాడు-నేడు’ కార్యక్రమం కాదు.. ఓ ​‍‘సంస్కరణ’

14 Nov, 2019 14:22 IST|Sakshi

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు

సాక్షి, విశాఖపట్నం: నాడు-నేడు అనేది కార్యక్రమం కాదని..ఓ సంస్కరణ అని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసే కార్యక్రమాల్లో భాగమే నాడు-నేడు అని చెప్పారు. సంస్కరణలు ఎప్పుడు చేపట్టిన విమర్శలు వస్తాయన్నారు. ‘తెలుగు భాషను పరిరక్షించాలని చొక్కాలు చింపుకొని కొంతమంది మాట్లాడుతున్నారని..వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్నారా’ అని ప్రశ్నించారు.

కుమారుడు భవిష్యత్తుపై ఆయనకు భయం పట్టుకుంది..
ఇసుక లేదు.. ఇంగ్లీష్ వద్దంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు రోడ్ల మీదకు వచ్చి దీక్షలు చేస్తున్నారని..లోకేష్ కు ఇక రాజకీయ భవిష్యత్ ఉండదేమో అనే భయం ఆయనకు పట్టుకుందని విమర్శించారు. ప్రభుత్వ విద్యార్థుల్లో మట్టిలో మాణిక్యాలు ఉంటాయని.. సానబెడితేనే ప్రతిభాపాటవాలను వెలికితీయొచ్చన్నారు. పేరెంట్స్ కమిటీలను రాజకీయాలకు అతీతంగా గా ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రం లో రాజకీయ జోక్యం లేకుండా పాలన జరుగుతోందని తెలిపారు. మధ్యాహ్న భోజన పథకంపై సమీక్ష నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ఆసియా లో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో విశాఖ జిల్లా ప్రాధాన్యత గల ప్రాంతమని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు