రైతు భరోసా కేంద్రాల పనితీరుపై మంత్రి సమీక్ష

20 Jun, 2020 18:34 IST|Sakshi
(ఫైల్‌ ఫోటో)

సాక్షి, విజయవాడ: వ్యవసాయ, అనుబంధ సేవలు రైతు వద్దకే తెచ్చేందుకు ప్రతిష్టాత్మకంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. రైతు భరోసా కేంద్రాలు పనితీరు-వ్యవసాయ యాంత్రీకరణపై శనివారం ఆయన సమీక్ష జరిపారు. సమావేశంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనమ్ మాలకొండయ్య, పశు సంవర్ధక, మత్స్యశాఖ, ఉద్యాన శాఖ, ఇతర అనుబంధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  రైతు భరోసా కేంద్రాల పనితీరు, ఇతర సాంకేతిక అంశాలపై అధికారులతో మంత్రి చర్చించారు. (టమాటో ఛాలెంజ్‌తో రైతులకు ఊరట)

వ్యవసాయానికి కావాల్సిన ఉత్పత్తులు మార్కెట్ ధర కన్నా నాణ్యమైన, తక్కువ ధరతో రైతులకు అందించేలా కేంద్రాలు పని చేయాలని అధికారులకు మంత్రి కన్నబాబు సూచించారు. ఈ కేంద్రాల్లో  కొత్తగా పశుగ్రాసం, ఖనిజ లవణాలు మిశ్రమాలు, పశువుల దాణా తదితర వ్యవసాయ సంబంధిత ఉత్పత్తులు రైతులకు అందుబాటులో ఉంచాలని తెలిపారు. రైతులకు అందించే ఉత్పత్తుల్లో నాణ్యత తగ్గకుండా, త్వరితగతిన సేవలు అందించేలా ఆయా కంపెనీల ను సన్నద్ధం చేయాలని పేర్కొన్నారు. అగ్రోస్ సంస్థ నోడల్ ఏజెన్సీ గా ఉండి వ్యవసాయ, అనుబంధ శాఖలతో సమన్వయం చేసుకుని రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు మరింత సేవ చేయాలని మంత్రి కోరారు. మరిన్ని కంపెనీలతో ఆయా ఉత్పత్తుల కోసం ఒప్పందాలు చేసుకునేలా చూడాలన్నారు. నర్సరీ ఉత్పత్తులను కూడా ప్రోత్సహించాలని అధికారులకు మంత్రి కన్నబాబు సూచించారు. (రెండో విడత 'వైఎస్సార్‌ నేతన్న నేస్తం')

మరిన్ని వార్తలు