మహిళా ప్రగతి కేంద్రంలో గ్రామ వాలంటీర్ల శిక్షణ

3 Aug, 2019 08:34 IST|Sakshi
శిక్షణ కరదీపిక, నవరత్న మాలికను ఆవిష్కరిస్తున్న మంత్రి ముత్తంశెట్టి, ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ 

మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

టీవోటీలకు రెండు రోజుల శిక్షణ తరగతులు ప్రారంభం

సాక్షి, పెందుర్తి(విశాఖపట్టణం) : రాష్ట్రంలో అవినీతిలేని పాలన అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర్ట పర్యాటక, సాంస్కృతిక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. త్వరలో బాధ్యతలు తీసుకోనున్న గ్రామ వలంటీర్లు పారదర్శకంగా పని చేసి ప్రజల మన్ననలు అందుకోవాలని సూచించారు. టీవోటీలు వలంటీర్లకు ఆ దిశగా చక్కటి దిశానిర్దేశం చేయాలన్నారు. పెందుర్తి లోని డీఆర్‌డీఎ మహిళా ప్రగతి కేంద్రంలో శుక్రవారం గ్రామ వలంటీర్లకు శిక్షణ అందించనున్న జిల్లాస్థాయి టీవోటీలకు రెండు రోజుల శిక్షణ తరగతులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ వలంటీర్లకు అప్పగించిన పనిని సమర్థవంతంగా నిర్వర్తించాలన్నారు.

వారికి కేటాయించిన 50 కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల అవగాహన కలిగించి కుల, మత, వర్గ తేడాలు లేకుండా, రాజకీయాలకు అతీతంగా సంక్షేమపథకాలు అందేలా చూడాల్సి ఉంటుందన్నారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు గ్రామ సచివాలయానికి చేరవేసి వాటి పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి పేర్కొన్నారు. వలంటీర్లు అవినీతికి పాల్పడితే జిల్లాస్థాయి కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు తెలియజేయాలని అక్కడ న్యాయం జరగకపోతే స్వయంగా ముఖ్యమంత్రి పర్యవేక్షించే రాష్ట్రస్థాయి కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు.  నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ  వ్యవస్థకు శ్రీకారం చుట్టారని దాన్ని అందరూ సద్విని యోగం చేసుకోవాలని సూచించారు.  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా అందరం పని చేయాలని ఆకాంక్షించారు.

పెందుర్తి శాసనసభ్యుడు అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ మాట్లాడుతూ ప్రభుత్వ హయాంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. గ్రామాల అభివృద్ధిలో వలంటీర్ల పాత్ర అంత్యంత కీలకమన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. గ్రామ వలంటీర్ల శిక్షణ కరదీపిక, నవరత్న మాలిక కరదీపికను మంత్రి, ఎమ్మెల్యే  ఆవిష్కరించారు. కార్యక్రమంలో జేసీ–2 ఎం.వెంకటేశ్వరరావు, జెడ్పీ సీఈవో రమణమూర్తి, డీపీవో కృష్ణకుమారి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తిరుపతిరావు, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకుడు జయప్రకాష్, డీఈవో లింగేశ్వరరెడ్డి, డీఆర్‌డీఎ ఇన్‌చార్జి పీడీ రామ్మోహనరావు, ఎంపీడీవోలు,  ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

జీవీఎంసీ ఎన్నికలే టార్గెట్‌: ఎంపీ విజయసాయి రెడ్డి

‘ముక్క’మాటానికిపోయి.. 

ఎన్‌ఎంసీ బిల్లు రద్దు చేయాల్సిందే..

ఇసుక దిబ్బల్లో కాంట్రాక్టు గద్ద 

బాపట్ల ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ సస్పెన్షన్‌

ఆన్‌లైన్‌లో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు

నా రూటే.. సపరేటు ! 

బలవంతంగా స్కూల్‌కి.. బస్సులోంచి దూకేశాడు

ముసురు మేఘం.. ఆశల రాగం..

కర్నూలు కమిషనర్‌గా అభిషిక్తు కిషోర్‌ 

ప్రభుత్వాస్పత్రిలో టిక్‌టాక్‌ కలకలం

బ్రిటానియా బిస్కెట్ ఫ్యాక్టరీలో అగ్రి ప్రమాదం

తీవ్రవాదాన్ని అణచివేసే చర్యలకు సంపూర్ణ మద్దతు

పరిశ్రమల స్వర్గధామం ఏపీ 

సెప్టెంబర్‌ 8న కూడా సచివాలయాల పరీక్ష

7,966 లైన్‌మెన్‌ పోస్టుల భర్తీ 

కన్సల్టెన్సీలకు స్వస్తి 

పోలీసులూ.. ప్రజా సేవకులే!

నదుల అనుసంధానంలో నవయుగకు నజరానాలు!

వానొచ్చె.. వరదొచ్చె..

చంద్రయాన్‌–2 కక్ష్య దూరం పెంపు

ఏపీ అభివృద్ధికి తోడ్పాటునివ్వండి: వైవీ సుబ్బారెడ్డి

ఈనాటి ముఖ్యాంశాలు

వైఎస్సార్‌సీపీ రైతు పక్షపాతి : పార్థసారథి

అన్నా క్యాంటీన్ల మూసివేతపై మంత్రి బొత్స..

ఘనంగా గవర్నర్‌ పుట్టినరోజు వేడుకల ఏర్పాట్లు

పరిశ్రమలను ఆదుకుంటాం : గౌతమ్‌ రెడ్డి

‘చరిత్ర పునరావృతం కాబోతుంది’

‘గ్రామ వలంటీర్ల నియామకాల్లో అవకతవకల్లేవు’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ద్విపాత్రాభినయం

నటుడు విశాల్‌కు అరెస్ట్‌ వారెంట్‌

అలా చేశాకే అవకాశమిచ్చారు!

గుణ అనే పిలుస్తారు

తుగ్లక్‌ దర్బార్‌లోకి ఎంట్రీ

వసూళ్ల వర్షం పడుతోంది