అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధే సీఎం లక్ష్యం..

13 Jan, 2020 13:40 IST|Sakshi

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

సాక్షి, గుంటూరు: గత ఐదేళ్లుగా ప్రజలకు చంద్రబాబు గ్రాఫిక్స్‌ చూపించారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ.. రాజధానిలో భూములను దోపిడీ చేసిన చంద్రబాబు.. ఆ భూములను కాపాడుకోవడానికి జోలె పట్టి బిక్షాటన డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌ విషయంలో జరిగిన తప్పు వలన రాష్ట్రంలో ఏ పట్టణం అభివృద్ధి చెందలేదని..మళ్లీ ఇప్పుడు అదే తప్పు  చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సిద్ధంగా లేరని స్పష్టం చేశారు.

అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో వికేంద్రీకరణ చేపడుతున్నారని వెల్లడించారు. రాజధానిలో 10 గ్రామాల్లో ప్రజలను టీడీపీ నేతలు రెచ్చగొట్టి ఉద్యమాలు చేయిస్తున్నారని మండిపడ్డారు. అన్ని ప్రాంతాలను సమాన అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందన్నారు. అందుకే వైఎస్‌ జగన్‌ నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారని పెద్దిరెడ్డి పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు