లాక్‌డౌన్‌ పాటించి.. కరోనాను ఎదుర్కొందాం

24 Mar, 2020 19:02 IST|Sakshi

మంత్రి పేర్ని నాని

సాక్షి, విజయవాడ: కరోనా వైరస్‌ నియంత్రణకు ప్రతి పౌరుడు వారియర్‌గా పోరాడాలని మంత్రి పేర్ని నాని పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో టెన్త్ పరీక్షలు వాయిదా వేశామని పేర్కొన్నారు. గుంటూరు మిర్చి యార్డ్‌ను తాత్కాలికంగా మూసివేశామని చెప్పారు. ఎంసెట్, ఈసెట్ దరఖాస్తులకు ఆన్‌లైన్‌లో గడువు పెంచామన్నారు. ఈసెట్‌కు ఏప్రిల్ 9 వరకు ఆన్‌లైన్‌లో గడువు పెంచామని పేర్కొన్నారు. (లాక్‌డౌన్‌ను కచ్చితంగా పాటించాల్సిందే: డీజీపీ) 

కరోనా వైరస్‌ పై అవగాహన కోసం రాష్ట్ర వ్యాప్తంగా హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేశామని చెప్పారు. సామాజిక దూరం ద్వారా కరోనాను నియంత్రించవచ్చన్నారు. లాక్‌డౌన్‌ను పాటించి కరోనాను ఎదుర్కొందామని తెలిపారు. సోషల్‌ మీడియాలో కరోనాపై  వదంతులను నమ్మొద్దని ఆయన సూచించారు. తప్పడు ప్రచారాలు చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల శుభ్రత కూడా అవసరమని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.
(చైనాలో బయటపడిన మరో వైరస్‌!) 

మరిన్ని వార్తలు