రైతులకు ప్రభుత్వం అండ..

30 May, 2020 11:49 IST|Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి: వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయ సేవలు రైతులకు అందుబాటులోకి వచ్చాయని రాష్ట్ర  గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు అన్నారు. శనివారం ఆయన ఆచంట వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళారులు వ్యవస్థ లేకుండా నేరుగా రైతు భరోసా కేంద్రాలు ద్వారా ధాన్యం కొనుగోలు చేయాన్నలదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్దేశమని పేర్కొన్నారు. (రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించిన సీఎం జగన్‌)

భరోసా కేంద్రాల ద్వారా పంటలకు ఇన్సూరెన్స్‌ సదుపాయం కూడా కల్పిస్తారన్నారు. కేంద్రాల ద్వారా నేరుగా రైతులకు ఎరువులు, పురుగు మందులు అందిస్తామని తెలిపారు. దళారులతో మోసపోవద్దని.. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు పార్టీలో గుర్తింపు ఉంటుందని.. వారికి త్వరలోనే పదవులు కూడా ఇస్తామని మంత్రి శ్రీరంగనాథ రాజు వెల్లడించారు. (జ(గ)న్‌ రంజక పాలనకు ఏడాది)

మరిన్ని వార్తలు