‘చంద్రబాబు ఏనాడు వారి గురించి ఆలోచించలేదు’

7 Nov, 2019 13:02 IST|Sakshi

సాక్షి, అనంతపురం : ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని చూసి టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు సిగ్గుపడాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకర్‌ నారాయణ మండిపడ్డారు. గురువారం జిల్లాలోని అంబేద్కర్ భవన్‌లో అగ్రిగోల్డ్ బాధితులకు ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి మంత్రి చెక్కులు పంపిణీ చేశారు.  అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మానవతా దృక్పథంతో స్పందించి అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేశారని అన్నారు. 40 సంవత్సరాల పొలిటికల్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు.. ఏనాడూ అగ్రిగోల్డ్ బాధితుల గురించి ఆలోచించలేదని విమర్శించారు. 

అగ్రిగోల్డ్ ఆస్తులను కాజేసేందుకు చంద్రబాబు శతవిధాల కుట్ర చేశారని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి  ఆరోపించారు. అగ్రిగోల్డ్ బాధితుల అకౌంట్లలోకి నేరుగా డబ్బు జమ చేస్తున్నామని అనంతపురం జిల్లా కలెక్టర్ సత్యనారాయణ వివరించారు. ఏపీ వ్యాప్తంగా అగ్రిగోల్డ్ బాధితుల కోసం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రూ.1150 కోట్లు కేటాయించిందని వెల్లడించారు. అనంతపురం జిల్లాకు రూ.20.65 కోట్లు వచ్చిందని.. 24000 మంది అగ్రిగోల్డ్ బాధితుల అకౌంట్లలో వేస్తున్నామన్నారు.  ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అనంతవెంకట్రామిరెడ్డి, డాక్టర్ తిప్పేస్వామి, ఎంపీ గోరంట్ల మాధవ్ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు