అగ్నిమాపక శాఖ భవనాలకు శాశ్వత నిర్మాణాలు

22 May, 2020 17:03 IST|Sakshi

అభివృద్ధికి రూ.28 కోట్లు నిధులు

హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత

సాక్షి, కాకినాడ: విపత్తుల సమయంలో అగ్నిమాపక సిబ్బంది సేవలు అభినందనీయమని హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఆమె శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 29 అగ్నిమాపక కేంద్ర భవనాల అభివృద్ధికి రూ.28 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశామని వెల్లడించారు. అగ్నిమాపక శాఖ భవనాలకు శాశ్వత నిర్మాణాలు చేపడతామని చెప్పారు.
(చేతులేత్తి మొక్కుతా.. వదిలేయండి: ఎంపీ మాధవ్‌)

కష్టకాలంలో కూడా నవరత్న పథకాలు అమలు..
నవరత్న పథకాలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని కరోనా కష్టకాలంలో కూడా నెరవేరుస్తున్నారని సుచరిత తెలిపారు. ఈ విపత్తు సమయంలో సున్నా వడ్డీ కింద మహిళా సంఘాలకు రూ.1400 కోట్లు  ఇచ్చారన్నారు. ప్రతి ఏడాది మే నెలలోనే రైతు భరోసా సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లోనే కరోనా నిర్ధారణ పరీక్షలు అధికంగా జరుగుతున్నాయని మంత్రి సుచరిత వివరించారు.
(దశలవారీ మద్యనిషేధంపై కసరత్తు షురూ..)

మరిన్ని వార్తలు