పారదర్శకంగా ‘అమ్మఒడి’ లబ్ధిదారుల ఎంపిక

4 Jan, 2020 11:20 IST|Sakshi

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

సాక్షి, అమరావతి: అమ్మఒడి పథకం లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేశామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు.శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అన్ని గ్రామాలు,పాఠశాలల్లో అమ్మఒడి లబ్ధిదారుల జాబితాలు పెట్టామని వెల్లడించారు. ఇప్పటి వరుకు 43 లక్షల మంది తల్లులను లబ్ధిదారులుగా గుర్తించామని పేర్కొన్నారు. తెల్ల రేషన్‌కార్డు, ఆధార్‌, బ్యాంక్‌ ఖాతాలను తనిఖీ చేసి లబ్ధిదారులను గుర్తించామన్నారు. అమ్మ ఒడి పథకం కోసం రూ.6,400 కోట్లు కేటాయించామని తెలిపారు. ఈ నెల 9న చిత్తూరులో అమ్మఒడి పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. దేశంలో అమ్మఒడి పథకం అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అని పేర్కొన్నారు. 5వ తేదీ వరకు ఎంతమంది లబ్ధిదారులను గుర్తిస్తే అంత మందికి ఈ పథకం వర్తిస్తుందన్నారు. ముందుగా ఒక్క రూపాయి ఖాతాల్లో వేసి లబ్ధిదారుల ఖాతాలను తనిఖీ చేస్తామని తెలిపారు. 9న ఒకేసారి రూ.15వేలు జమ చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు