రైతులను టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు

30 May, 2020 13:08 IST|Sakshi

మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత

సాక్షి, పశ్చిమగోదావరి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతు పక్షపాతిగా పాలన నిర్వహిస్తున్నారని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం వ్యవసాయం దండగ అంటూ రైతులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. రైతులకు మేలు చేసేవిధంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అండదండలు అందిస్తోందన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రూ.13,500  పెట్టుబడి సాయం అందించిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించారని పేర్కొన్నారు. రైతు భరోసా కేంద్రాలు ద్వారా రైతులకు వ్యవసాయ సేవలు అందించడమే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. భరోసా కేంద్రాలతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.
(వాళ్ల కష్టాలు విన్నా.. చూశా: సీఎం జగన్‌)

మరిన్ని వార్తలు