ఏపీలో అర్చక పరీక్ష ఫలితాలు విడుదల

24 Oct, 2019 19:42 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఈ ఏడాది జూలైలో నిర్వహించిన అర్చక పరీక్షకు సంబంధించిన ఫలితాలను మంత్రి వెల్లంపల్లి శ్రీనావాస్‌ గురువారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్‌ కోన రఘనతి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కమిషనర్‌ పద్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ.. మొత్తం 7687 మంది అభ్యర్థులకు గానూ 4396 మంది ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. కాగా, పరీక్షలో ఫేయిలయిన వారికి సప్లిమెంటరీ నిర్వహిస్తామని వెల్లడించారు.  2013 తర్వాత రాష్ట్రంలో అర్చకులకు పరీక్షలు నిర్వహించలేదని , ఇక మీద ప్రతి ఏటా అర్చకులకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. అంతేగాక జగన్‌ ముఖ్యమంత్రి కాగానే అర్చకులకు పరీక్షలు నిర్వహించాలని సూచించినట్లు గుర్తుచేశారు. ఈ అర్చక పరీక్షల ద్వారా విదేశాల్లో విరివిగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి వెల్లడించారు. అర్చకత్వం చేసుకునేవారికి పట్టా లభించడంతో పాటు ఉద్యోగాలు పర్మినెంట్‌ అయ్యే అవకాశం ఉందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అభిప్రాయపడ్డారు. 
 

మరిన్ని వార్తలు