50 ఏళ్లకే ఇంటికి పంపించం: యనమల

30 Jul, 2017 01:41 IST|Sakshi
50 ఏళ్లకే ఇంటికి పంపించం: యనమల
భానుగుడి (కాకినాడ): ప్రభుత్వ నిర్వాకాలను సాక్ష్యాలతో సహా ప్రజలముందు ఉంచుతున్న ‘సాక్షి’ దినపత్రికపై ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. శనివారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘50 ఏళ్లకే ఇంటికి’ కథనంపై ఆయన స్పందించారు.   ఉద్యోగుల పనితీరు ఆధారంగా బలవంతంగా పదవీ విరమణ చేయించే జీవోలను అమలు చేసే యోచన ప్రభుత్వానికి లేదని యనమల చెప్పారు.

శనివారం సాయంత్రం కాకినాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చి పదవీ విరమణ వయసును 58 నుంచి 60 సంవత్సరాలకు పెంచిన ఘనత చంద్రబాబుదేనన్నారు.  జీవో ముసాయిదా కాపీలతో సహా ‘సాక్షి’ ప్రచురించినా అదంతా అవాస్తవమని యనమల చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
>
మరిన్ని వార్తలు