ముగిసిన మంత్రివర్గ ఉపసంఘం భేటీ

10 May, 2018 17:19 IST|Sakshi
ఏపీ మున్సిపల్‌ శాఖా మంత్రి నారాయణ

అమ‌రావ‌తి: సీఆర్‌డీఏపై మంత్రి వ‌ర్గ ఉపసంఘం భేటీ ముగిసింది. అనంతం ఏపీ మున్సిపల్‌ శాఖా మంత్రి నారాయణ విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 1312 ఎక‌రాల‌ను 65 సంస్థలకు కేటాయించామని తెలిపారు. రాజ‌ధాని ప్రాంతంలో 65 సంస్థల్లో 7 సంస్థలు మాత్రమే నిర్మాణాలు చేపట్టాయని వెల్లడించారు. వ‌చ్చే మంత్రి వ‌ర్గ స‌మావేశంలో విట్, ఎస్‌ఆర్‌ఎం, మాతా అమృత‌మ‌యి లాంటి సంస్థల‌కు మ‌రో 100 ఎక‌రాల చొప్పున కేటాయింపు ప్రతిపాదనలు పంపుతున్నామని చెప్పారు.

 అలాగే బాబు జ‌గ‌జ్జీవ‌న్ రాం స్మృతివ‌నానికి 10 ఎక‌రాలు, ఇండియ‌న్ ఆర్మీకి 4 ఎక‌రాలు, చండ్ర రాజేశ్వర రావు ట్రస్ట్‌కు 3 ఎక‌రాలు, ఇషా ఫౌండేష‌న్‌కు 10 ఎక‌రాల చొప్పున కేటాయింపుల‌కు మంత్రివర్గ ఉప సంఘం ఆమోదం తెలిపిందని వ్యాఖ్యాఇనంచారు. సీఆర్‌డీఏ ప‌రిధిలో భూకేటాంపులు చేసినా..ప‌నులు ప్రారంభించని  ప్రైవేటు సంస్థలకు నోటీసులు జారీ చేశామని చెప్పారు.

మరిన్ని వార్తలు