విభజన బిల్లు.. గడువు గడబిడ

19 Jan, 2014 01:37 IST|Sakshi
విభజన బిల్లు.. గడువు గడబిడ

 సమీపిస్తున్న విభజన బిల్లు గడువు... రాష్ట్రపతికి పోటాపోటీ లేఖలు
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చకు గడువు విషయంలో కాంగ్రెస్‌లోని సీమాంధ్ర, తెలంగాణ నేతలు పరస్పరం భిన్న వాదనలు చేస్తున్నారు. అదే వైఖరిని ప్రతిబింబిస్తూ రాష్ట్రపతికి లేఖలు రాయడానికి కూడా సిద్ధవువుతున్నారు. గడువు పెంచాలంటూ సీమాంధ్ర నేతలు, పెంచరాదని కోరుతూ తెలంగాణ నేతలు ఆయనకు లేఖలు రాయాలన్న నిర్ణయానికి వచ్చారు. విభజన బిల్లు డిసెంబర్ 13న శాసనమండలికి, రాష్ట్ర అసెంబ్లీకి చేరడం తెలిసిందే. 40 రోజుల్లోగా అసెంబ్లీ అభిప్రాయంతో దాన్ని తిప్పి పంపాలని రాష్ట్రపతి నిర్దేశించారు. ఆ గడువు జవనరి 23వ తేదీతో ముగుస్తోంది.
 
 ఈ నేపథ్యంలో గడుపు పెంపు కోరుతూ సీవూంధ్ర వుంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరికి వారే విడిగా రాష్ట్రపతికి లేఖలు రాయూలని నిర్ణయించారు. ఈ మేరకు దాదాపు ఒకే రకమైన లేఖను సిద్ధం చేసి, దానిపై సంతకాలు పెట్టి పంపిస్తున్నారు. ‘‘అసెంబ్లీలో ప్రస్తుతం 270 మందికి పైగా సభ్యులున్నారు. బిల్లుపై ప్రతి సభ్యుడూ తన అభిప్రాయం చెప్పాలి. కనుక మరికొంత గడువు అవసరమే. అదే విషయూన్ని రాష్ట్రపతిని లేఖ ద్వారా కోరనున్నాం’’ అని వూజీ వుంత్రి గాదె వెంకటరెడ్డి పేర్కొన్నారు. చర్చలో పార్టీలవారీగా సవుయుం కేటారుుంచడం సరికాదని, సభ్యులు వ్యక్తిగతంగా అభిప్రాయాలు చెప్పుకునేందుకు అవసరమైన సవుయం ఇవ్వాల్సి ఉంటుందని ఆయనన్నారు.
 
 గడువు పెంచొద్దు
 ఇక తెలంగాణకు చెందిన కాంగ్రెస్ సహా ఇతర పార్టీల ఎమ్మెల్యేలేమో గడువు పెంచాల్సిన అవసరం లేనే లేదంటూ రాష్ట్రపతికి లేఖలు రాస్తున్నారు. ఇలా మొత్తం 119 మంది ఎమ్మెల్యేలూ సంతకాలతో కూడిన లేఖలు రాయాలన్న ఆలోచనతో ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంతకాల సేకరణ దాదాపు పూర్తయిందని మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. గడువు పెంచొద్దంటూ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలంతా విడిగా రాష్ట్రపతికి ఒక లేఖ రాయనున్నట్టు ఆ పార్టీ శాసనసభాపక్ష నాయకుడు ఈటెల రాజేందర్ తెలిపారు. ఇక బీజేపీలో చేరిన స్వతంత్ర ఎమ్మెల్యే నాగం జనార్దనరెడ్డితో పాటు పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు కలిసి మరో లేఖ రాస్తామని శాసనసభాపక్ష నాయకుడు యెండల లక్ష్మీనారాయణ చెప్పారు.
 
 ఇలా ఎమ్మెల్యేలు పార్టీలవారీగా లేఖ రాయాలని నిర్ణయించుకున్నా వాటన్నింట్లోనూ ఒకే విషయాన్ని ప్రస్తావిస్తామని వారంటున్నారు. బిల్లుపై చర్చకు సంబంధించి మూడు ప్రధానాంశాలను రాష్ట్రపతికి రాసే లేఖలో ప్రముఖంగా ప్రస్తావించనున్నారు. ‘‘ఉత్తరప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్ర శాసనసభలోనే విభజన బిల్లు చర్చకు వస్తే కేవలం పది గంటల పాటు మాత్రమే చర్చించి కేంద్రానికి తిప్పి పంపారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఇప్పటికే 20 గంటలకు పైగా చర్చ సాగింది. శాసనసభ్యులందరూ బిల్లుపై తమ అభిప్రాయాలను సవరణల రూపంలో ఇప్పటికే స్పీకర్‌కు అందజేశారు. తొమ్మిది వేలకు పైగా సవరణలు తనకందాయంటూ స్పీకర్‌నే సభలో ప్రకటించారు’’ అని ప్రస్తావిస్తున్నారు.
 
 కిరణ్ లేఖపై పెదవి విరుపు
 ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సభా నాయకుడిగా ఉంటూ, గడువు పెంచాలని కోరుతూ ఎవరికీ చెప్పకుండా రాష్ట్రపతికి అత్యంత రహస్యంగా లేఖ రాయడంపై ఆయన సన్నిహిత మంత్రుల్లో కూడా విస్మయం వ్యక్తమైంది. విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న తరుణంలో సభకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా సీఎం లేఖ రాయడమేమిటని పలువురు మంత్రులు వ్యాఖ్యానించారు. కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా రాష్ట్రపతికి లేఖ రాయాల్సిన అవసరమేమొచ్చిందో అర్థం కావడం లేదని కిరణ్ సన్నిహిత మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు