చాంబర్‌లు పరిశీలించిన మంత్రులు

10 Jun, 2019 09:37 IST|Sakshi

సాక్షి, అమరావతి : కొత్త మంత్రివర్గంలో కొలువుతీరిన అమాత్యులకు చాంబర్ల (పేషీ) ఏర్పాటుకు సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) చర్యలు చేపట్టింది. దీంతో పలువురు మంత్రులు తమకు కేటాయించిన చాంబర్‌లను పరిశీలించారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం ఉదయం మూడు, ఐదు బ్లాక్‌లను పరిశీలించారు. జీఏడీ అధికారులతో చర్చించి తన చాంబర్‌పై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

కాగా రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నిన్న (ఆదివారం) తన సతీమణి ఝూన్సీతో కలిసి ఏపీ సచివాలయంలో తనకు కేటాయించిన చాంబర్‌ను పరిశీలించారు. రెండవ బ్లాక్‌లోని మున్సిపల్‌ శాఖ మంత్రి పేషీని పరిశీలించిన ఆయన పేషీకి అవసరం అయిన మార్పులు సూచించారు. అలాగే కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను కూడా పరిశీలించారు. అలాగే దేవాదాయ శాఖమంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ అనుచరులు ఆయనకు కేటాయించిన పేషీని పరిశీలించారు. నాలుగో బ్లాక్‌లోని విద్యాశాఖ పేషీని ఆయనకు కేటాయించాలని జీఏడీ అధికారులను కోరారు. ఇక విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ కుటుంబ సభ్యులు వచ్చి విద్యాశాఖ మంత్రి చాంబర్‌ను పరిశీలించారు.

మరిన్ని వార్తలు