కడప స్టీల్‌ ప్లాంట్‌పై కేంద్ర ఉక్కుశాఖ సమీక్ష

18 Oct, 2018 19:59 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కడప స్టీల్‌ ప్లాంట్‌ విషయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాగుడు మూతలు ఆడుతున్నాయి. అందుబాటులో ఉ‍న్న ఇనుప ఖనిజం, మైనింగ్‌ లీజు వివరాలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదంటూ కేంద్ర ఉక్కు శాఖ మళ్లీ పాత పాటే పాడింది.  కడప స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుపై సమీక్ష నిర్వహించిన కేంద్ర ఉక్కుశాఖ సాంకేతిక నివేదిక ఇవ్వాలని మెకాన్‌ సంస్థను ఆదేశించింది. ఇప్పటికే మెకాన్‌ సంస్థ ముసాయిదా నివేదిక ఉక్కు శాఖకు అందేజేసింది. సాంకేతిక నివేదికపై వివిధ సంస్థలు కసరత్తు చేస్తున్నాయి. ఇనుప ఖనిజం నిల్వలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని కేంద్ర ఉక్కు శాఖ పేర్కొంది.

మైనింగ్‌ లీజు, అందుబాటులో ఉన్న ఇనుప ఖనిజం వివరాలు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకోవాలని మెకాన్‌ సంస్థను ఆదేశించింది. ఆ వివరాల ఆధారంగానే సాధ్యాసాధ్యాల నివేదిక రిపోర్టు తయారు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేటు , సంయుక్త భాగస్వామ్యం తదితర మార్గాల్లో పెట్టుబడి అంశాలను కూడా అధ్యయనం చేయాలని ఉక్కు  శాఖ టాస్క్ ఫోర్స్‌కు ఆదేశాలు జారీ చేసింది.

మరిన్ని వార్తలు